‘ధృవ’తార... దృఢావతార...
‘చిరుత’నయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్... ధృవ సినిమాలో టాప్‌క్లాస్ ఫిజిక్‌తో... తర్వాత ఈ విషయంలో తండ్రికే గురువయ్యాడు. ఆ సినిమాలో చెక్కిన శిల్పంలా అనిపించిన ఈ ధృవతారను చెక్కిన శిల్పి కూడా మామూలు ట్రైనర్ కాదు. అతని పేరు రాకేష్. ముంబయిలో పేరొందిన ఫిట్నెస్ శిక్షకుడు. కండల వీరుడు సల్మాన్‌ఖాన్ నుంచి దంగల్ ఫైటర్ అమీర్‌ఖాన్ దాకా పలువురు బాలీవుడ్ స్టార్స్ ఫిజిక్‌లను తీర్చిదిద్దాడు. చరణ్ కోసం ముంబయి నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కి వచ్చి మరీ శిక్షణ అందించిన రాకేష్ ‘సాక్షి’తో మాట్లాడారు.
సల్మాన్ నేను చాలా కాలంగా మంచి మిత్రులం. ఆయన ఎప్పటి నుంచో నా దగ్గరే వ్యాయామ శిక్షణ పొందుతున్నారు. సల్మాన్ నాకు రామ్ చరణ్‌ను పరిచయం చేశారు. అప్పటికే రామ్ చరణ్‌ది మంచి ఫిజిక్. అయితే తన తర్వాతి సినిమాలోని పాత్రకు గాను పూర్తి బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కావాలని ఆయన కోరుకున్నారు. అందుకు మూడు నెలల పైన సమయం మాకు పట్టింది.
ప్రత్యేకమైన స్టైల్ డిజైన్ చేశా : రామ్ చరణ్ మంచి ఫిజిక్కు... అతను చాలా మంచి డ్యాన్సర్ కావడం కూడా ఒక కారణమని నేననుకుంటాను. సరే... చరణ్ కోసం రెగ్యులర్‌గా కాకుండా ఎమ్‌టియుటి (మెనస్ టైమ్ అండర్ టెన్షన్) స్టైల్ అనే ఒక ప్రత్యేకమైన వర్కవుట్ డిజైన్ చేశాను. ఇదే అమీర్‌ఖాన్‌కి కూడా డిజైన్ చేశాను. ముందుగా ఆయన బాడీ లాంగ్వేజ్‌ని పరిశీలిస్తాను. అదే విధంగా చరణ్‌ను కూడా విశ్లేషించి ఆయన వర్కవుట్‌ని ప్లాన్ చేశాం. చరణ్ చాలా పట్టుదల గల వ్యక్తి కావడంతో నా పని మరింత తేలికైంది.
బ్యాలెన్స్డ్ డైట్ : చరణ్ లక్ష్యానికి అనుగుణంగా సింపుల్ కార్బ్ డైట్ ఫాలో అయ్యాడు. దాదాపు 1900 నుంచి 2000 కేలరీల వరకూ ఆహారం ద్వారా అందేలా జాగ్రత్త పడ్డాం. దీనిలో ప్రోటీన్‌ను, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నింటినీ సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాం.
రెండు పూటలా...వర్కవుట్ : ఉదయం, సాయంత్రం రెండు పూటలా వర్కవుట్ టైమింగ్స్ సెట్ చేసుకున్నాం. ఉదయం కనీసం 45 నిమిషాల కార్డియోతో చరణ్ వర్కవుట్ ప్రారంభమయ్యేది. ఆ తర్వాత ఎమ్‌టియుటి పద్ధతిలో వర్కవుట్. అదే విధంగా సాయంత్రం గంట పాటు వర్కవుట్ తర్వాత 30 నిమిషాల పాటు కార్డియో ఉండేది. నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ కార్డియో వర్కవుట్ చాలా అవసరం. కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకూ కార్డియో వ్యాయామాలు చేయాల్సిందే. అది శారీరక సామర్ధ్యాన్ని సానబెడుతుంది.
క్రెడిట్ అంతా చరణ్‌దే : చరణ్ ప్రతి రోజూ ఉదయం 2గంటలు, సాయంత్రం 2గంటలు వర్కవుట్ చేసేవాడు. ఉదయం 5గంటల నుంచి కార్డియో, యాబ్స్... చేసేవారు. సాయంత్రం షూటింగ్ పూర్తయ్యాక 2 మజిల్ గ్రూప్స్‌కి చేసేవారు. ఏ వర్కవుట్ అయినా రిపిటీషన్స్ కౌంట్ ఉండేది కాదు ఎంత చేయగలిగితే అంత అన్నట్టుండేది. ఆయన వ్యాయామం జులైలో ప్రారంభించారు. దాదాపు నాలుగు నెలల్లోనే సిక్స్‌ప్యాక్‌తో పాటు మంచి ఫిజిక్‌ని సాధించారు.
–డామ్నిక్, ట్రైనర్ (స్థానికంగా చరణ్‌కి శిక్షణ ఇచ్చారు)