సినిమా చూసి సెల్యూట్‌ కొడతారు | Salman Khan and Ram Charan unveil Varun Tej Operation Valentine trailer | Sakshi
Sakshi News home page

సినిమా చూసి సెల్యూట్‌ కొడతారు

Published Wed, Feb 21 2024 1:37 AM | Last Updated on Wed, Feb 21 2024 1:37 AM

Salman Khan and Ram Charan unveil Varun Tej Operation Valentine trailer - Sakshi

సందీప్‌ ముద్దా, మానుషీ చిల్లర్, వరుణ్‌ తేజ్, నవదీప్

‘‘మన సైనికుల త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మనందరికీ దేశభక్తి ఉంటుంది.. కానీ, మా సినిమా చూశాక అది మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో వరుణ్‌ తేజ్‌. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’.

మానుషీ చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్‌ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రోడక్షన్స్, సందీప్‌ ముద్దా రినైసన్స్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను హీరో సల్మాన్‌ ఖాన్, తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్‌ రిలీజ్‌ చేశారు. వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘మన దేశంలో సినిమా పెద్ద వినోద సాధనం.

సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరూ ముందు సినిమావైపు వెళ్తారు. అందుకే ప్రేక్షకులు ఖర్చు పెట్టే టిక్కెట్‌ డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. చాలా కొత్తగా, ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ కూర్చుని గూస్‌ బంప్స్‌ మూమెంట్స్‌ని ఎంజాయ్‌ చేసే చాలా సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఈ సినిమాని చాలా గర్వంగా, గుండెల నిండా దేశభక్తితో చూసి మన సైనికులకు సెల్యూట్‌ కొడతారు’’ అన్నారు. ‘‘యాక్షన్, ఫన్, ఎమోషన్‌.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు శక్తి ప్రతాప్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement