నేను ఆ సినిమా చేయట్లేదు.. | Madhavan Confirmed not doing in thani oruvan telugu remake | Sakshi
Sakshi News home page

నేను ఆ సినిమా చేయట్లేదు..

Published Sat, Oct 24 2015 11:11 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

నేను ఆ సినిమా చేయట్లేదు..

నేను ఆ సినిమా చేయట్లేదు..

ప్రస్తుతం సౌత్ సినీ రంగంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా ఉన్న సినిమా 'తనీ ఒరువన్'. తమిళ్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు రీమేక్లో మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రీమేక్ రైట్స్ను సొంతం చేసుకున్న నిర్మాతలు, ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు.

తనీ ఒరువన్ సినిమాలో హీరో పాత్రతో పాటు విలన్ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంది. తమిళ్లో అరవింద్ స్వామి చేసిన ఈ పాత్రను తెలుగులో ఎవరితో చేయించాలన్న చర్చ చాలారోజులుగా నడుస్తుంది. యంగ్ హీరో రానా నుంచి సీనియర్ హీరో నాగార్జున వరకు చాలా పేర్లు చర్చకు వచ్చాయి. అయితే ఫైనల్గా లవర్ బాయ్ మాధవన్ ఈ పాత్రకు సెలెక్ట్ అయ్యాడంటూ వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలను మాధవన్ ఖండించాడు. ప్రస్తుతం 'సాల ఖదూస్' సినిమాలో నటిస్తున్నఅతడు, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించాడు. తను ఓ రీమేక్ సినిమాలో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని అవాస్తమని తెలిపాడు. తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన విశేషాలను వెల్లడించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement