15 ఏళ్ల తరువాత బాలీవుడ్లో..! | Arvind swamy dear dad first look release | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల తరువాత బాలీవుడ్లో..!

Published Sat, Apr 2 2016 10:57 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

15 ఏళ్ల తరువాత బాలీవుడ్లో..!

15 ఏళ్ల తరువాత బాలీవుడ్లో..!

సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక జెట్ స్పీడులో దూసుకుపోతున్నాడు సౌత్ స్టార్ అరవింద్ స్వామి. హీరోగా రిటైరయిన ఈ చాక్లెట్ బాయ్, రీ ఎంట్రీలో స్పెషల్ క్యారెక్టర్స్తో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు తనీఒరువన్ సినిమాలో నెగెటివ్ రోల్లో నటించిన అరవింద్ స్వామి నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాను ఏ భాషల్లో రీమేక్ చేసినా అరవింద్ స్వామి పాత్రకు మరో నటుడ్ని ఎంపిక చేయటం కష్టం అనిపించే స్థాయిలో ఆ పాత్రకు ప్రాణం పోశాడు.

అదే జోరులో బాలీవుడ్లో కూడా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత ఓ బాలీవుడ్ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. డియర్ డాడ్ పేరుతో తెరకెక్కుతన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. 45 ఏళ్ల తండ్రికి, 14 ఏళ్ల కొడుకు మధ్య జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాకు తనూజ్ బ్రమర్స్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను మే 6 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement