dear dad
-
త్వరలో డెరైక్షన్!
‘తని ఒరువన్’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా కనిపించిన మాజీ హీరో అరవింద్ స్వామి ఈ చిత్రం తెలుగు రీమేక్‌లోనూ అదే పాత్ర చేస్తున్నారు. మరో పక్క ‘డియర్ డాడ్’ అనే చిత్రంతో హిందీలో రీ-ఎంట్రీ ఇస్తున్నారాయన. ఇన్నాళ్లు వ్యాపారంలో బిజీబిజీగా ఉన్న అరవింద్‌స్వామి ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే దృష్టి సారించనున్నారు. నటుడిగా మాత్రమే కాదు.. డెరైక్షన్ కూడా చేయాలనుకుంటున్నారు. ‘‘ఇప్పటికే నా చేతిలో రెండు స్క్రిప్టులున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తా. అయితే అది హిందీలోనా...లేక తమిళంలోనా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను’’ అని వెల్లడించారాయన. కాలానుగుణంగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచి గురించి అరవింద్ స్వామి మాట్లాడుతూ- ‘‘ప్రేక్షకులు రొటీన్ ఐడియాలను తిప్పికొడుతున్నారు. వాళ్లు సినిమాలు చూసే విధానంలో మార్పు వచ్చింది. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే రకరకాల ప్రయోగాలతో సినిమాలు తీయడానికి ఆస్కారం దొరుకుతోంది’’ అని వ్యాఖ్యానించారు. -
15 ఏళ్ల తరువాత బాలీవుడ్లో..!
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక జెట్ స్పీడులో దూసుకుపోతున్నాడు సౌత్ స్టార్ అరవింద్ స్వామి. హీరోగా రిటైరయిన ఈ చాక్లెట్ బాయ్, రీ ఎంట్రీలో స్పెషల్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు తనీఒరువన్ సినిమాలో నెగెటివ్ రోల్లో నటించిన అరవింద్ స్వామి నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాను ఏ భాషల్లో రీమేక్ చేసినా అరవింద్ స్వామి పాత్రకు మరో నటుడ్ని ఎంపిక చేయటం కష్టం అనిపించే స్థాయిలో ఆ పాత్రకు ప్రాణం పోశాడు. అదే జోరులో బాలీవుడ్లో కూడా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత ఓ బాలీవుడ్ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. డియర్ డాడ్ పేరుతో తెరకెక్కుతన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. 45 ఏళ్ల తండ్రికి, 14 ఏళ్ల కొడుకు మధ్య జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాకు తనూజ్ బ్రమర్స్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను మే 6 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.