ఆగస్టులో తనీఒరువన్ | Thani Oruvan audio in July and release in August | Sakshi
Sakshi News home page

ఆగస్టులో తనీఒరువన్

Published Thu, Jul 9 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

Thani Oruvan audio in July and release in August

న్యాయానికి,అన్యాయానికి మధ్య పోరాటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. న్యాయం కోసం హీరో పోరాడుతుంటే దాన్ని మటుమాయం చేయడానికి విలన్లు శత విధాల ప్రయత్నింస్తుంటారు. ఈ ఇతి వృత్తాన్ని విభిన్నంగా, ఊహించని మలుపులతో ఆసక్తికరంగా తనీఒరువన్ పేరుతో చిత్రంగా రూపొందిస్తునట్లు దర్శకుడు మోహన్‌రాజా వెల్లడించారు. మోహన్‌రాజా అనగానే కొత్త దర్శకుడనుకునేరు. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన జయంరాజా ఇప్పుడు తన పేరు ముందు తొలి చిత్రం జయంను తొలగించి తన పేరు ముందు తండ్రి పేరు మోహన్‌ను చేర్చుకున్నారు. జయం, సంతోష్‌సుబ్రమణియ న్, వేలాయుధం వంటి హిట్ చిత్రాలను రూపొందించిన మోహన్‌రాజా తాజాగా సెల్యులాయిడ్ కెక్కిస్తున్న చిత్రం తనీఒరువన్.
 
  జయంరవి హీరో. వీరి హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆరవ చిత్రం ఇది. నయనతార హీరోయిన్. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కల్పాత్తి అగోరం, ఎస్.గణేశ్ అగోరం, ఎస్.సురేష్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం తనీఒరువన్. అరవింద్‌సామి ముఖ్య భూమికను పోషించిన ఈ చిత్రంలో తంబిరామయ్య, నాజర్ ముఖ్య పాత్రలు ధరించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగే పోరాటాన్ని వైవిధ్యంగా, అనూహ్య మలుపులతో తెరకెక్కిస్తునట్లు తెలిపారు. షూటిం గ్‌ను డెహ్రాడూన్. గోవా,బ్యాంకాక్ ప్రదేశాల్లో నిర్వహించినట్లు వెల్లడించారు. హిప్‌హుప్ తమిళ్ సంగీతాన్ని అందించిన చిత్ర ఆడియోను ఈ నెల 15న, చిత్రాన్ని ఆగస్టులోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement