రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్..? | ani kanneganti prolitical thriller with ram charan | Sakshi
Sakshi News home page

రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్..?

Published Thu, Mar 24 2016 9:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్..?

రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్..?

బ్రూస్ లీ సినిమా ఫెయిల్యూర్తో ఆలోచనలో పడ్డ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్ రీమేక్కు రెడీ అవుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ మూవీతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు మెగా పవర్ స్టార్. అందుకు తగ్గట్టుగా ఒరిజినల్ కథకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుతం చెల్లెలు శ్రీజ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న చెర్రీ.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించనున్నాడు.

అయితే ఇప్పటివరకు మాస్ మసాలా సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న చరణ్ను పొలిటికల్ థ్రిల్లర్లో నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నాడు యువ దర్శకుడు అనీ కన్నెగంటి. ఈ శుక్రవారం రన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనీ, తన మనసులోని మాటను బయటపెట్టాడు. నాలుగేళ్ల క్రితమే చరణ్తో ఈ సినిమాతో ఈ తరహా సినిమా చేయాలని భావించినా, అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా కుదరలేదు. మరోసారి అదే ప్రయత్నాలను ప్రారంభించాడు అనీ కన్నెగంటి.

చరణ్ హీరోగా సోషియో పొలిటికల్ డ్రామాగా సినిమా చేయాలని, ఎప్పటికైనా తప్పకుండా ఆ సినిమా చేస్తానంటూ చెపుతున్నాడు అనీ. ప్రయోగం చేసిన ప్రతిసారీ ఫెయిల్ అయిన చెర్రీ అనీ కన్నెగంటి దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ కు ఓకే చెబుతాడా? లేదా తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement