మెగా అభిమానులకు చెర్రీ షాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ ధృవ. తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్లో కేవలం మూడు పాటలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఒకటి టైటిల్లో వస్తుంది. మరోటి బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది. మూడో పాట సెకండ్ హాప్లో రొమాంటిక్ సిచ్యూవేషన్లో వస్తుంది. దీంతో ఈ సినిమాలో హీరోకి ఇరగదీసి స్టెప్పులేసే అవసరం రాలేదు.
అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం భారీ మార్పులు చేసారన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా చెర్రీ డ్యాన్స్లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి.. ప్రత్యేకంగా చెర్రీ డ్యాన్స్ల కోసమైనా పాటలను యాడ్ చేసి ఉంటారని భావించారు. చెర్రీ.., తన మాస్ డ్యాన్స్ ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చాడు. హైఇంటెన్సిటీతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్లో అనవసరంగా పాటల ఇరికించటం వల్ల, సినిమా ఫ్లో దెబ్బతింటుందన్న ఉద్దేశంతో తెలుగు వర్షన్ను కూడా మూడు పాటలతోనే ముగించేస్తున్నారట. అంటే చెర్రీ డ్యాన్స్లు చూడాలంటే అభిమానులు మరో సినిమా వరకు వెయిట్ చేయాల్సిందే.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. తమిళ సంగీత దర్శుడు హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్కు రెడీ అవుతోంది.