సల్మాన్ నిర్మాత.., చరణ్ హీరో | Ram Charan refutes multistarrer with salman khan rumours | Sakshi
Sakshi News home page

సల్మాన్ నిర్మాత.., చరణ్ హీరో

Published Fri, Apr 15 2016 12:47 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

సల్మాన్ నిర్మాత.., చరణ్ హీరో

సల్మాన్ నిర్మాత.., చరణ్ హీరో

టాలీవుడ్లో మెగా వారసుడిగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్, బాలీవుడ్ ఆశలు మాత్రం చంపుకోలేకపోతున్నాడు. ఎన్నో ఆశలతో చెర్రీ చేసిన బాలీవుడ్ ఎంట్రీ 'జంజీర్' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో తరువాత బాలీవుడ్ ఆలోచన పక్కన పెట్టేశాడు. అయితే పూర్తిగా మాత్రం కాదు. కొద్ది రోజులుగా సల్మాన్ ఖాన్తో కలిసి చరణ్, ఓ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడన్న వార్త, బాలీవుడ్తో పాటు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.
 
ఈ వార్తల పై స్పందించిన చెర్రీ అలాంటి ఆలోచనే లేదని తేల్చి చెప్పాడు. అయితే జంజీర్ సినిమా సమయంలోనే సల్మాన్, తన సొంత బ్యానర్ లో చరణ్ హీరోగా సినిమాను నిర్మిస్తానని మాట ఇచ్చాడట. ప్రస్తుతం ఆ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నారని, అన్నీ కుదిరితే సల్మాన్ బ్యానర్లో మరోసారి బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటానంటున్నాడు. మరి సల్మాన్ అయిన చరణ్కు బాలీవుడ్లో బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement