సల్మాన్ ఖాన్కు రామ్చరణ్ డబ్బింగ్ | Ramcharan voice for salman khan prem rathan dhan payo | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్కు రామ్చరణ్ డబ్బింగ్

Published Tue, Oct 20 2015 10:35 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

సల్మాన్ ఖాన్కు రామ్చరణ్ డబ్బింగ్

సల్మాన్ ఖాన్కు రామ్చరణ్ డబ్బింగ్

టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్లో ఓ ఆసక్తి కరమైన వార్త చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్గా ప్రజెంట్ వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్కు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడట.  సల్మాన్ చేస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా కోసం ఈ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేస్తున్నారు చిత్రయూనిట్.

'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాను హిందీతో పాటు ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర నిర్మాణ సంస్ధ రాజశ్రీ ప్రొడక్షన్స్, అయితే తెలుగు వర్షన్లో సల్మాన్ పాత్రకు ఓ స్టార్ హీరోతో డబ్బింగ్ చెప్పించాలని భావించిన యూనిట్ సభ్యులు సల్మాన్తో సన్నిహిత సంబందాలు ఉన్న మెగా ఫ్యామిలీ హీరో అయితే కరెక్ట్ అని భావించారట. అందుకే సల్మాన్ ఖాన్ స్వయంగా చెర్రీకి ఫోన్ చేసి అడగటంతో చరణ్ వెంటనే ఒప్పేసుకున్నాడన్న టాక్ వినిపిస్తుంది.

గతంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'మైనే ప్యార్ కియా', 'హమ్ ఆప్కే హై కౌన్' సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి విజయాలు సాదించాయి. ఈ రెండు సినిమాలు తెలుగులో సక్సెస్ చేసిన రాజశ్రీ సంస్థ మరోసారి సల్మాన్ హీరోగా అదే మ్యాజిక్ను రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా సల్మాన్ సినిమాకు చరణ్ డబ్బింగ్ అన్న వార్త మాత్రం ఫిలిం నగర్లో గట్టిగానే వినిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement