ఈమె తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం? | Kathi Movie Heroine Sana Khan Pic With Son Latest | Sakshi
Sakshi News home page

Guess The Actrees: కొడుకుతో ఉన్న ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా?

Published Mon, Oct 2 2023 9:02 PM | Last Updated on Mon, Oct 16 2023 7:56 PM

Kathi Movie Heroine Sana Khan Pic With Son Latest - Sakshi

సినిమా ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా హీరోయిన్ల కెరీర్ సాగుతూ ఉంటుంది. అలాంటిది నటిగా మంచి స్థితిలో ఉన్నప్పుడే ఈమె పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఆ వెంటనే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం కొడుకుతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు సనా ఖాన్. అవును మీరు ఊహించింది కరెక్టే. కల్యాణ్ రామ 'కత్తి', నాగ్ 'గగనం', 'మిస్టర్ నూకయ్య' తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది ఈమెనే. తండ్రి మలయాళీ, తల్లిది ముంబయి. అలా ముంబయిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2005లో బాలీవుడ్‪‌లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది.

(ఇదీ చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!)

హిందీ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. దాదాపు 14 ఏళ్లపాటు నటించింది. ఇక 2019లో కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో రిలేషన్ మొదలుపెట్టింది. ఏడాది తిరగకుండానే విడిపోయింది. ఇది జరిగిన కొద్దిరోజులకు యాక్టింగ్ వదిలేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చింది.

కట్ చేస్తే 2020 నవంబరులో ఇస్లామిక్ స్కాలర్ మఫ్టీ అనాస్ సయ్యద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీళ్ల బంధానికి గుర్తుగా ఈ ఏడాది జులైలో అబ్బాయి పుట్టాడు. రీసెంట్‌గా భర్త, కొడుకుతో కలిసి మక్కా వెళ్లిన సనాఖాన్ అందుకు సంబంధించిన ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈమెని తొలుత గుర్తుపట్టలేకపోయిన నెటిజన్స్.. గుర్తొచ్చిన తర్వాత ఈమెనా అని కామెంట్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'బిగ్‪‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement