కత్తి, పులిపార్వై చిత్రాలను నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను మదురై కోర్టు కొట్టివేసింది. విజయ్ నటిస్తున్న భారీ చిత్రం కత్తి. సమంత హీరోయిన్. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై, ఎల్.టి.టి.ఈ నాయకుడు దివంగత ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ ఇతివృత్తంతో తెరకెక్కిన పులి పార్వై చిత్రంపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమిళ సంఘాలు చిత్రాన్ని విడుదల చేయరాదంటూ ఆందోళనలు చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితిలో ఈ చిత్రాల విడుదలను నిషేధించాలని కోరుతూ హైకోర్టుకు అనుబంధ శాఖ అయిన మదురై కోర్టులో మదురై కేకేనగర్‌కు చెందిన న్యాయవాది రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు చిత్రాల్లో తమిళ సంప్రదాయాన్ని శ్రీలంకలో జరిగిన యుద్ధాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయన్నారు. కత్తి చిత్రాన్ని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు బినామిగా వ్యవహరిస్తున్న సుభాష్ కరన్ నిర్మిస్తున్నారని తెలిపారు.
ఈ చిత్రంలో తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసే సంభాషణలు చోటు చేసుకున్నాయన్నారు. ఇక పులిపార్వై చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అందించడం ద్రోహ చర్యగా పేర్కొన్నారు. ఈ చిత్రాల విడుదలను నిషేధించాలంటూ డీజీపీకి ఆగస్టు 1న పిటిషన్ అందించామని తెలిపారు. కత్తి, పులిపార్వై చిత్రాల విడుదలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది రమేష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి కృపాకరన్ పిటిషన్‌లో సరైన ఆధారాలు చూపించనందున కొట్టివేస్తున్నట్లు వెల్లడించారు.
నిషేధ పిటిషన్ కొట్టివేత
Published Thu, Aug 21 2014 12:37 AM | Last Updated on Mon, Oct 8 2018 4:05 PM
Advertisement
Advertisement