ట్రంప్‌ రివేంజ్‌ పాలిటిక్స్‌.. 12 మంది ప్రాసిక్యూటర్ల తొలగింపు | Donald Trump Fires Team Of Lawyers Who Prosecuted Against Him In America, Check More Details Inside | Sakshi

ట్రంప్‌ రివేంజ్‌ పాలిటిక్స్‌.. 12 మంది ప్రాసిక్యూటర్ల తొలగింపు

Jan 28 2025 7:30 AM | Updated on Jan 28 2025 11:06 AM

Trump Fires His Cases Prosecutors In America

వాషింగ్టన్‌:రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్‌ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో రాజకీయ కక్ష తీర్చుకునే నిర్ణయాలు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ 12 మంది దాకా ప్రాసిక్యూటర్లను తొలగించింది. వీరంతా గత ప్రభుత్వంలో ట్రంప్‌ను ప్రాసిక్యూట్‌ చేసిన లాయర్లు కావడం గమనార్హం. 

బైడెన్‌ హయాంలో ట్రంప్‌ పలు క్రిమినల్‌ కేసుల్లో విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అధ్యకక్షుడిని కేసులతో ముప్పుతిప్పలు పెట్టిన వారిని వదిలేదని లేదన్న సంకేతాలను జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. 

‘గతంలో అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రాసిక్యూట్‌ చేసిన న్యాయవాదులను యాక్టింగ్‌ అటార్నీ జనరల్‌ సర్వీసు నుంచి తొలగించారు. అధ్యక్షుడి ఎజెండాను అమలు చేయలేరన్న కారణంతోనే వీరిని తొలగిస్తున్నాం’అని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్‌ను ప్రాసిక్యూట్‌ చేసిన న్యాయవాదులంతా ప్రత్యేక కౌన్సిల్‌ జాక్‌స్మిత్‌ నేతృత్వంలో పనిచేశారు. జాక్‌ స్మిత్‌ జనవరి మొదటి వారంలోనే తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 

కాగా, ట్రంప్‌ గత ప్రభుత్వ హయంలో ప్రముఖంగా ‘క్యాపిటల్‌’ తిరుగుబాటు, పోర్న్ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ హష్‌మనీ కేసులను ఎదుర్కొన్నారు. వీటిలో హష్‌మనీ కేసులో ట్రంప్‌ ఇప్పటికే దోషిగా తేలారు. అయితే కోర్టు ట్రంప్‌కు ఈ కేసులో ఎలాంటి శిక్ష వేయలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement