Prosecutors
-
ట్రంప్ రివేంజ్ పాలిటిక్స్.. 12 మంది ప్రాసిక్యూటర్ల తొలగింపు
వాషింగ్టన్:రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో రాజకీయ కక్ష తీర్చుకునే నిర్ణయాలు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ 12 మంది దాకా ప్రాసిక్యూటర్లను తొలగించింది. వీరంతా గత ప్రభుత్వంలో ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన లాయర్లు కావడం గమనార్హం. బైడెన్ హయాంలో ట్రంప్ పలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అధ్యకక్షుడిని కేసులతో ముప్పుతిప్పలు పెట్టిన వారిని వదిలేదని లేదన్న సంకేతాలను జస్టిస్ డిపార్ట్మెంట్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ‘గతంలో అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన న్యాయవాదులను యాక్టింగ్ అటార్నీ జనరల్ సర్వీసు నుంచి తొలగించారు. అధ్యక్షుడి ఎజెండాను అమలు చేయలేరన్న కారణంతోనే వీరిని తొలగిస్తున్నాం’అని జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన న్యాయవాదులంతా ప్రత్యేక కౌన్సిల్ జాక్‌స్మిత్ నేతృత్వంలో పనిచేశారు. జాక్ స్మిత్ జనవరి మొదటి వారంలోనే తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాగా, ట్రంప్ గత ప్రభుత్వ హయంలో ప్రముఖంగా ‘క్యాపిటల్’ తిరుగుబాటు, పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ హష్మనీ కేసులను ఎదుర్కొన్నారు. వీటిలో హష్మనీ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. అయితే కోర్టు ట్రంప్‌కు ఈ కేసులో ఎలాంటి శిక్ష వేయలేదు. -
‘క్రిమినల్ జస్టిస్’లో ప్రాసిక్యూటర్లే కీలకం
సాక్షి, హైదరాబాద్: నేర న్యాయవ్యవస్థ (క్రిమినల్ జస్టిస్ సిస్టం)లో ప్రాసిక్యూటర్లు వెన్నెముకలాంటి వారని, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో ప్రాసిక్యూటర్లదే కీలకపాత్ర అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కీలకమైన ప్రాసిక్యూషన్ విభాగంలో పోస్టులను భర్తీ చేయకపోవడం తమను ఆందోళనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 270 ప్రాసిక్యూటర్ పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో 70 మాత్రమే భర్తీ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ విభాగాన్ని బలోపేతం చేయకుండా, వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణ, మౌలిక వసతులు కల్పించకపోతే నేరస్తులకు శిక్షలు పడేశాతం తక్కువగానే ఉంటుందని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేని కేసుల్లో కూడా ప్రాసిక్యూషన్ వైఫల్యం కారణంగా నిందితులకు బెయిల్ లభిస్తోందని, దీంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ విభాగం బలోపేతానికి స్పష్టమైన ప్రణాళికలతో రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ప్రాసిక్యూటర్ల ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు ఎంత సమయం పడుతుంది? ఈ విభాగానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారు? ఇప్పటికే నియమితులైన ప్రాసిక్యూటర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారు? కోర్టు భవనాల ఆవరణలో ప్రాసిక్యూటర్ల కోసం ప్రత్యేకంగా భవనాల నిర్మాణం.. ఇతర సదుపాయాలపై ఈనెల 14 లోగా సమగ్రమైన నివేదిక సమర్పించాలి’అని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్. జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ప్రాసిక్యూటర్ల కొరత విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాసిక్యూటర్ పోస్టుల ఖాళీలతో కింది కోర్టుల్లో క్రిమినల్ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై రిజిస్ట్రార్ జనరల్ రాసిన లేఖను 2018లో ధర్మాసనం సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. చాలా కోర్టుల్లో ప్రాసిక్యూటర్లు లేరు ‘చాలా కోర్టులకు ప్రాసిక్యూటర్లు లేరు. ఒకే ప్రాసిక్యూటర్ పలు కోర్టులకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మహిళల మీద నేరాలను విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టులకు ఫుల్‌టైం ప్రాసిక్యూటర్లు లేరు. దీంతో కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ప్రాసిక్యూటర్లకు సైతం నైపుణ్యం లేదు, వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉంది. అలాగే నిందితులకు సంబంధించి ఇతర నేరాల రికార్డులను కూడా సమర్పించడం లేదు. నార్కోటిక్స్.. తదితర కేసుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించలేకపోవడంతో నిందితులు బెయిల్ మీద విడుదల అవుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రాసిక్యూటర్లకు తగిన మౌలిక వసతులను కూడా కల్పించడం లేదు. అనేక కోర్టుల్లో వారు కూర్చోవడానికి, కేసులకు సంబంధించిన ఫైళ్లు పెట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేకాక బాధితులకు సత్వర న్యాయం జరిగే అవకాశం లేకుండా పోతోంది’అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. -
సౌమ్య హత్యకేసు; లాయర్లపై కేజ్రీవాల్ ఆగ్రహం!
సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్ల క్రితం హత్యకు గురైన జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలంటూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ‘ ఈ కేసును వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గనుక సరైన రీతిలో స్పందించనట్లైతే వారికి షోకాజు నోటీసులు జారీ చేస్తాం. వారి తీరు నిజంగా నన్ను విస్మయపరిచింది. అదే విధంగా వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా టీవీ జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ సెప్టెంబరు 30, 2008లో తన కారులోనే దారుణ హత్యకు గురయ్యారు. విధులు ముగించుకుని తెల్లవారుజామున ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు.. వసంత్ కుంజ్ వద్ద ఆమెను కాల్చి చంపారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను 2009లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు. పదేళ్లుగా విచారణ కొనసాగుతున్నా తన కూతురి హత్య కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో సౌమ్య తండ్రి ఎంకే విశ్వనాథన్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విచారణకు హాజరు కాకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో సౌమ్య హత్య కేసును వాదిస్తున్న లాయర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. -
నిస్సాన్ మోటార్స్ ఛైర్మన్ అరెస్ట్
నిస్సాన్ మోటార్స్ ఛైర్మన్ కార్లోస్ గోన్ (64)కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. వివిధ అవినీతి ఆరోపణల కింద విచారణాధికారులు గోన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక వాణిజ్య చట్టం ఉల్లంఘనలు, ఎక్స్చేంజ్ చట్టం ఉల్లంఘనతదితర ఆరోపణల నేపథ్యంలో టోక్యో ప్రాసిక్యూటర్స్ గోన్‌ను అరెస్ట్ చేశారని రాయిటర్స్ నివేదించింది. మరోవైపు గోన్తోపాటు, బోర్డు డైరెక్టర్ గ్రెగ్ కెల్లీలపై కంపెనీ ఆస్తుల దుర్వినియోగం, తదితర పలు ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా విచారణ జరుగుతోందని జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ ధృవీకరించింది. అంతర్గత దర్యాప్తులో గోన్ నివేదించిన ఆదాయ వివరాలు అవాస్తవాలుగా తేలాయని తెలిపింది. దీంతో వీరిద్దరినీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్నుంచి తొలగించాల్సిందిగా సీఈవో హిరోటో సైకవా బోర్డును కోరనున్నారని తెలిపింది. ఈ వ్యవహారంపై మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడిస్తామని చెప్పింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో నిస్సాన్ , రెనాల్ట్ కౌంటర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. -
'నాకిప్పుడే చావాలని లేదు.. విచిడిపెట్టు'
అమెరికాలో ఇటీవల ఓ పదిహనేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి జరిపి హత్య చేసిన ఘటన గురించి విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించి చాలా దారుణమైన అంశాలు వెలుగుచూశాయి. ఎప్పటి నుంచో ఆ బాలికకు స్నేహితుడిగా ఉన్న వాడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటన జరిగే రోజు బాలిక ఎంత ప్రాధేయపడినా వినకుండా అతడు ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ వివరాలను శుక్రవారం విచారణ ప్రాసీక్యూటర్ వెల్లడించాడు. అమెరికాలోని కరెన్ పరేజ్ అనే పదిహేనేళ్ల బాలిక టెక్సాస్ లోని సీబీఎస్ కేహెచ్ఓయూ అనే పాఠశాలలో చదువుతోంది. అదే పాఠశాలలో మరో మైనర్ బాలుడు చదువుతున్నాడు. అతడు ఆమెకు స్నేహితుడు. గత సోమవారం కరెన్ కనిపించకుండా పోయింది. దీంతో ఆమెకోసం గాలింపు చర్యలు చేపట్టగా ఓ పాడుబడిన బంగ్లాలో ఒంటిపై చిరిగిన దుస్తులతో అర్ధనగ్నంగా విగతజీవిగా పడి ఉంది. ఆమెపై ఎవరో లైంగిక దాడి చేసి హత్య చేసి ఉంటారని అంతా భావించారు. అయితే, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె స్నేహితుడు(జువైనెల్)ను అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్కూల్లో సీసీటీవీ ఫుటేజీ కాల్ డేటా, ఎస్సెమ్మెస్ డేటా పరిశీలించారు. అనంతరం అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఆ ఫోన్లో రికార్డయిన దృశ్యాల ప్రకారం ఆ బాలుడు ఆ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నిస్తుండగా తనకు ఆ పనిచేయడం ఇష్టం లేదని, దయచేసి తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడుతున్నట్లున్న ఆడియో రికార్డయి ఉంది. అంతేకాకుండా ఆ బాలిక గొంతు నులిమి ఊపిరాడకుండా చేసే క్రమంలో తనకు ఇంకా బతకాలని ఉందని, చనిపోవాలని లేదని, తనను విడిచిపెట్టాలని పెనుగులాటినట్లున్న సంభాషణ కూడా రికార్డయి ఉంది. అయినా ఆ బాల నేరస్తుడు కర్కశంగా వ్యవహరించి ఆ బాలికను లైంగిక దాడి చేసి చంపేశాడు. మరో విషయం ఏమిటంటే.. ఆ బాలిక అతడి స్నేహితురాలు కావడంతో కనిపించకుండా పోయిన రోజు ఆ బాలుడు తండ్రి అతడ్ని పక్కనే కూర్చొబెట్టుకొని నగరమంతా వెతుకుతున్న సమయంలోనే అలా చేయడం వృధా ప్రయాస అని, ఆమెను చంపేశానని చెప్పినట్లు ముందే ఒప్పుకున్నాడని కూడా ప్రాసీక్యూటర్ వెల్లడించాడు. ఇక కోర్టులో కూడా నిర్భయంగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. -
బంజారాహిల్స్‌లో హైటెక్ వ్యభిచారం