
'నాకిప్పుడే చావాలని లేదు.. విచిడిపెట్టు'
అమెరికాలో ఇటీవల ఓ పదిహనేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి జరిపి హత్య చేసిన ఘటన గురించి విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించి చాలా దారుణమైన అంశాలు వెలుగుచూశాయి. ఎప్పటి నుంచో ఆ బాలికకు స్నేహితుడిగా ఉన్న వాడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటన జరిగే రోజు బాలిక ఎంత ప్రాధేయపడినా వినకుండా అతడు ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ వివరాలను శుక్రవారం విచారణ ప్రాసీక్యూటర్ వెల్లడించాడు.
అమెరికాలోని కరెన్ పరేజ్ అనే పదిహేనేళ్ల బాలిక టెక్సాస్ లోని సీబీఎస్ కేహెచ్ఓయూ అనే పాఠశాలలో చదువుతోంది. అదే పాఠశాలలో మరో మైనర్ బాలుడు చదువుతున్నాడు. అతడు ఆమెకు స్నేహితుడు. గత సోమవారం కరెన్ కనిపించకుండా పోయింది. దీంతో ఆమెకోసం గాలింపు చర్యలు చేపట్టగా ఓ పాడుబడిన బంగ్లాలో ఒంటిపై చిరిగిన దుస్తులతో అర్ధనగ్నంగా విగతజీవిగా పడి ఉంది. ఆమెపై ఎవరో లైంగిక దాడి చేసి హత్య చేసి ఉంటారని అంతా భావించారు.
అయితే, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె స్నేహితుడు(జువైనెల్)ను అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్కూల్లో సీసీటీవీ ఫుటేజీ కాల్ డేటా, ఎస్సెమ్మెస్ డేటా పరిశీలించారు. అనంతరం అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఆ ఫోన్లో రికార్డయిన దృశ్యాల ప్రకారం ఆ బాలుడు ఆ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నిస్తుండగా తనకు ఆ పనిచేయడం ఇష్టం లేదని, దయచేసి తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడుతున్నట్లున్న ఆడియో రికార్డయి ఉంది.
అంతేకాకుండా ఆ బాలిక గొంతు నులిమి ఊపిరాడకుండా చేసే క్రమంలో తనకు ఇంకా బతకాలని ఉందని, చనిపోవాలని లేదని, తనను విడిచిపెట్టాలని పెనుగులాటినట్లున్న సంభాషణ కూడా రికార్డయి ఉంది. అయినా ఆ బాల నేరస్తుడు కర్కశంగా వ్యవహరించి ఆ బాలికను లైంగిక దాడి చేసి చంపేశాడు.
మరో విషయం ఏమిటంటే.. ఆ బాలిక అతడి స్నేహితురాలు కావడంతో కనిపించకుండా పోయిన రోజు ఆ బాలుడు తండ్రి అతడ్ని పక్కనే కూర్చొబెట్టుకొని నగరమంతా వెతుకుతున్న సమయంలోనే అలా చేయడం వృధా ప్రయాస అని, ఆమెను చంపేశానని చెప్పినట్లు ముందే ఒప్పుకున్నాడని కూడా ప్రాసీక్యూటర్ వెల్లడించాడు. ఇక కోర్టులో కూడా నిర్భయంగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.