సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హిట్ కాంబినేషన్ | Murugadoss, Vijay next set for a diwali release | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హిట్ కాంబినేషన్

Published Sun, Mar 26 2017 1:10 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హిట్ కాంబినేషన్

సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హిట్ కాంబినేషన్

కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా రెండు సార్లు వందకోట్ల కలెక్షన్లు సాధించిన కాంబినేషన్ దర్శకుడు మురుగదాస్, హీరో విజయ్లది. తుపాకి, కత్తి సినిమాలతో రెండు భారీ విజయాలను అందుకున్న ఈ కాంబినేషన్లో ఇప్పుడు మూడో చిత్రం తెరకెక్కనుందట. ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ను సాధించాలని భావిస్తున్నారు. అందుకే పక్కా కథా కథనాలతో పాటు సెంటిమెంట్ను కూడా రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన రెండు సినిమాలు దీపావళి కానుకగా రిలీజ్ అయ్యాయి. తుపాకీ సినిమా 2012 దీపావళికి రిలీజ్ కాగా., కత్తి సినిమా 2014 దీపావళి సమయంలో రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో ఈ కాంబినేషన్లో రూపొందబోయే హ్యాట్రిక్ సినిమాను కూడా అదే సమయంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కిస్తున్న మురుగదాస్, ఆ సినిమా పూర్తయిన తరువాత విజయ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాల పనులు ప్రారంభించనున్నాడు. విజయ్ కూడా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి మురుగదాస్ సినిమాకు డేట్స్ కేటాయించేలా ప్లాన్ చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2018 దీపావళి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement