మహేష్, విజయ్ల మల్టీ స్టారర్
మహేష్, విజయ్ల మల్టీ స్టారర్
Published Wed, Apr 6 2016 2:24 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించనున్నాడు. ఊపిరి సినిమాతో నాగార్జున, కార్తీలు కలిసి నటించగా మరోసారి అదే ఫార్ములాతో భారీ వసూళ్లను టార్గెట్ చేస్తున్నారు ఈ స్టార్ హీరోలు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమాలో హీరోగా నటిస్తున్న మహేష్ బాబు, ఆ సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. భారీ బడ్జెట్తో బైలింగ్యువల్గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ను సెట్ చేస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో తుపాకీ, కత్తి లాంటి సినిమాల్లో నటించిన విజయ్, ఈ ప్రపోజల్ను కాదనడన్ననమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్. అంతేకాదు తెలుగు మార్కెట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విజయ్, మహేష్ సినిమాలో గెస్ట్ రోల్లో నటిస్తే అది తనకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
మహేష్ కూడా తమిళ మార్కెట్ మీద పట్టు సాధించాలంటే విజయ్ లాంటి స్టార్ హీరో సాయం అవసరమనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను, మే లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోనే భారీ మల్టీ స్టారర్ తెర మీదకు వస్తుందేమో చూడాలి.
Advertisement
Advertisement