కత్తి లాంటి కాంబినేషన్..! | Vijay's 'Kaththi' Set for Big Openings in telugu | Sakshi
Sakshi News home page

కత్తి లాంటి కాంబినేషన్..!

Published Wed, Oct 8 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

కత్తి లాంటి కాంబినేషన్..!

కత్తి లాంటి కాంబినేషన్..!

 తమిళంలో క్రేజీ హీరోగా పేరున్న విజయ్ తాజా చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళనాట సినిమా రిలీజులకు కూడా పెద్ద పండగైన దీపావళికి విజయ్ నటించిన ‘కత్తి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తర్వాత ఇక్కడ తెలుగులోనూ అదే పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత కథానాయిక. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధిం చిన ఫొటోల్లో విజయ్, సమంతల కెమిస్ట్రీ చూసి కాంబినేషన్ కత్తిలా ఉందని అంటున్నారు.
 
  గతంలో ‘గజిని’, ‘స్టాలిన్’ లాంటి చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ ఈ ‘కత్తి’కి నిర్దేశకుడు. గతంలో విజయ్‌తోనే ‘తుపాకి’ లాంటి ఘనవిజయం అందించిన రికార్డు మురుగదాస్‌ది. దాంతో, ఈ తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై కె. కరుణామూర్తి, ఎ. శుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పణలో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ ఈ ‘కత్తి’లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ‘కొలవెరి..’ పాట ఫేమ్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. తమిళ సినిమాల వసూళ్ల రేసులో ‘కత్తి’ ఏ మేరకు పదును చూపిస్తుందో వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement