అక్షయ్ కుమార్ చేతిలో 'కత్తి' | akshay kumar to star in hindi remake of kaththi | Sakshi
Sakshi News home page

అక్షయ్ కుమార్ చేతిలో 'కత్తి'

Published Sat, Nov 21 2015 1:58 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

అక్షయ్ కుమార్ చేతిలో 'కత్తి'

అక్షయ్ కుమార్ చేతిలో 'కత్తి'

టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు కత్తి సినిమాను రీమేక్ చేయాలా..? వద్దా..? అన్న ఆలోచనలో ఉండగానే, బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాను మొదలెట్టేసేలా ఉన్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కత్తి సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. గతంలో విజయ్ హీరోగా తెరకెక్కిన తుపాకి సినిమాను హాలీడే పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని నమోదు చేశాడు. మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అక్షయ్.

తమిళ్లో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీ వర్షన్కు ఆయన శిష్యుడు జగన్ దర్శకత్వం వహించనున్నాడు. లైకా మూవీస్ బ్యానర్పై మురుగుదాస్ స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో అఖీరా సినిమాను తెరకెక్కిస్తున్న మురుగుదాస్, ఈ సినిమా తరువాత అక్షయ్ హీరోగా కత్తి రీమేక్ పనులు మొదలెట్టనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement