'కత్తి' కోసం పవన్... నో అంటున్న విజయ్ | pawan kalyan interested to remake kaththi, vijay likely to release dubbed version | Sakshi
Sakshi News home page

'కత్తి' కోసం పవన్... నో అంటున్న విజయ్

Published Mon, Oct 27 2014 10:11 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'కత్తి' కోసం పవన్... నో అంటున్న విజయ్ - Sakshi

'కత్తి' కోసం పవన్... నో అంటున్న విజయ్

వివాదాల నడుమ విడుదలై తమిళనాడులో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'కత్తి' చిత్రంపై టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ మనసు పారేసుకున్నట్లు సమాచారం. దాంతో పలువురు నిర్మాతలు ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కోలీవుడ్లో విజయ్- సమంత జంటగా నటించిన కత్తి చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

దాంతో పలువురు తెలుగు నిర్మాతలు 'కత్తి' రీమేక్ హక్కుల కోసం ఆసక్తి చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే సినిమా ఒరిజినల్ హక్కులను ఇంత వరకు ఎవరికీ అమ్మలేదని ఆ చిత్ర నిర్మాతల సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమా రీమేక్పై హీరో విజయ్ కూడా సుముఖంగా లేడని, ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి త్వరలో విడుదల చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఫలిస్తాయా, కత్తిని చేతబడతారా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement