remake rights
-
ఆ బడా నిర్మాతకు మలయాళం రొమాంటిక్ మూవీ రైట్స్..
Karan Johar Acquire Malayalam Movie Hridayam Rights: ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఓ మలయాళం బ్లాక్ బ్లస్టర్ హిట్ మూవీ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ సినిమా ఏంటంటే.. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హృదయం' చిత్రం. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్, దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సినిమా సోషల్ మీడియాతోపాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ మనసు గెలుచుకుంది ఈ మూవీ. దీంతో ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుుకన్నారు. సోషల్ మీడియా వేదికగా 'నేను మీతో ఈ వార్తను పంచుకోవడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ అండ్ ఫాక్స్ స్టార్ స్డూడియోస్ మలయాళం న్యూ ఏజ్ ప్రేమకథా చిత్రం హృదయం సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల హక్కులను పొందాయి.' అని కరణ్ జోహార్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రస్తుతం రణ్వీర్ సింగ్, అలియా భట్లు హీరోహీరోయిన్లుగా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో జయా బచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర కూడా నటించున్నారని సమాచారం. I am so delighted and honoured to share this news with you. Dharma Productions & Fox Star Studios have acquired the rights to a beautiful, coming-of-age love story, #Hridayam in Hindi, Tamil & Telugu – all the way from the south, the world of Malayalam cinema. pic.twitter.com/NPjIqwhz8l — Karan Johar (@karanjohar) March 25, 2022 -
‘ఉడుంబు’ తెలుగు రీమేక్ రైట్స్‌పై నిర్మాత క్లారిటీ
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మలయాళంలో అనూహ్య విజయం సాధించిన చిత్రం ‘ఉడుంబు’. అక్కడ ఈ చిత్రం పలు రికార్డులను సృష్టించింది. దీంతో ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం పలువురు తెలుగు దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరిచారు. పలు అగ్రనిర్మాణ సంస్థలు ‘ఉడుంబు’ రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. తెలుగు రీమేక్ రైట్స్ ఓ నిర్మాణ సంస్థ దక్కించుకుందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ పుకార్లపై తాజాగా ఉడుంబు చిత్ర దర్శకనిర్మాత కె.టి.తమరక్కుళం స్పందించారు. తెలుగు రీమేక్ రైట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ‘ఉడుంబు’ చిత్రాన్ని కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. భారీ తారాగణం లేకున్నా మలయాళంలో భారీ విజయం నమోదు చేసిన ‘ఉడుంబు’ చిత్రాన్ని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా... తమిళంలో ఓ సీనియర్ హీరోయిన్ తన తనయుడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రీమేక్ చేస్తున్నారు. మరి తెలుగు రీమేక్ హక్కులను ఎవరు సొంతం కానున్నాయో వేచి చూడాలి. -
దృశ్యం 2: అజయ్ కూడా తప్పించుకుంటాడు
‘దృశ్యం2’ హవా మొదలైంది. తెలుగులో వెంకటేశ్‌తో ఈ సినిమా రీమేక్ అధికారికంగా అనౌన్స్ అయ్యింది. మలయాళ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే హిందీలో కూడా దీనివార్తలు మొదలయ్యాయి. ‘దృశ్యం’ హిందీ వెర్షన్లో అజయ్ దేవ్‌గణ్, టబూ, శ్రేయ నటించారు. దృశ్యం2 హిట్ అవడంతోటే హిందీలో కూడా రీమేక్ పనులు మొదలయ్యాయి. అజయ్ దీనికి ఒక నిర్మాతగా వ్యవహరిస్తారు. దృశ్యంలో నటించినవారే ఇందులో కూడా నటించే అవకాశాలున్నాయి. అయితే ‘దృశ్యం’కు దర్శకత్వం వహించిన నిషికాంత్ కామంత్ గత సంవత్సరం సిరోసిస్‌తో మరణించడంతో ఈసారి హిందీ వెర్షన్‌కు జీతూ జోసఫ్‌నే అజయ్ తీసుకోనున్నాడని వినికిడి. తెలుగు రీమేక్‌ను పూర్తి చేసుకుని జీతూ హిందీ రీమేక్‌కు వెళ్లొచ్చు. కనుక మలయాళంలో మోహన్‌లాల్ శిక్ష తప్పించుకున్నట్టే తెలుగులో వెంకటేశ్ తప్పించుకోనున్నాడు. అజయ్ కూడా తప్పించుకోనున్నాడు. చూడాలి... ఈ రీమేక్స్ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. చదవండి: దృశ్యం 2: కుటుంబం గెలిచింది చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సురేఖ వాణి -
4 భాషల్లో మంజు వారియర్ సినిమా రీమేక్
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఇటీవల నటించిన చిత్రం ప్రతీ పూవన్‌కోజి. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీని తెలుగు, తమిళ్, కన్నడం,హిందీ భాషల్లో రీమేక్ చేయనున్నారు. హిందీలో ప్రతీ పూవన్‌కోజి సినిమాను బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన హిందీ రీమేక్ హక్కులను ఇప్పటికే బోనీ కపూర్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అదే విధంగా తెలుగు, తమిళ్, కన్నడలో కూడా వివిధ ప్రొడక్షన్ హౌజ్‌లు రీమేక్ హక్కులను స్వాధీనం చేసుకున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. చదవండి: ఆర్చ... అదరహా కథ రచయిత ఉన్ని ఆర్ రచించిన ‘సంకడం’ కథా ఆధారంగా ఈ సినిమాను రోషన్ ఆండ్సూస్ డైరెక్ట్ చేశారు. ప్రతీ పూవన్‌కోజి సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించడమే కాకుండా విలన్‌గా కూడా నటించారు. ఇది నటుడిగా రోషన్ తొలి సినిమా. కాగా వస్త్ర దుకాణంలో సేల్స్ వుమన్ పాత్ర పోషించిన మంజు వారియర్ ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. .మాధురి పాత్రలో లీనమై తనను బస్సులో వేధించిన ఓ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమా కథాంశం. ప్రస్తుతం మంజు వారియర్ మోహన్‌లాల్ నటిస్తున్న మరక్కమ్ సినిమాలో కనిపించనున్నారు. చదవండి: డ్యాన్సర్‌పై కొరియోగ్రాఫర్ అనుచిత ప్రవర్తన.. -
హిట్ సినిమా హక్కులు కొన్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రేక్షకుల ముందు వచ్చిన నేపథ్యంలో ఆయన తర్వాతి సినిమా ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో ఇంతకుముందే సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమా రీమేక్ హక్కులను కూడా చిరంజీవి సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్లో భాగంగా ఇటీవల చిరంజీవి కేరళలో పర్యటించారు. పృథ్విరాజ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని, సైరాలో నటించమని ఆయనను కోరినట్టు ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు. సైరాలో నటించలేకపోయినందుకు పృథ్విరాజ్ వినమ్రంగా సారీ చెప్పారు. ‘చిరంజీవి రత్నం లాంటి మనిషి. ఆయనతో కలిసి సైరా ప్రచారంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. మానవత్వం, మంచితనం మూర్తీభవించిన మనిషి ఆయన. లూసిఫర్ సినిమా రీమేక్ హక్కులు మీరు కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. సైరాలో నటించేందుకు మీరిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేనందుకు మన్నించాలి’ అంటూ పృథ్విరాజ్ ట్వీట్ చేశారు. లూసిఫర్ సినిమా మలయాళంలో సంచలన విజయం సాధించింది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మురళీ గోపీ కథను పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. కేరళలో రాజకీయ అనిశ్చితి సందర్భంగా ఓ కుటుంబంలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో మోహన్‌లాల్ రాజకీయ నాయకుడిగా నటించారు. లూసిఫర్ విజయవంతం కావడంతో ‘ఎంపురాన్’ పేరుతో దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. మూడో పార్ట్ కూడా ఉంటుందని సమాచారం. (చదవండి: సైరా హిట్.. మెగా ఫ్యామిలీ సంబరం) With #Chiranjeevi sir at the Kerala launch of #SyeraNarasimhaReddy What an absolute gem of a man! Humility and grace personified. I’m thrilled that you bought the rights to #Lucifer and will forever be sorry that I couldn’t take up your offer to be part of #SNR sir! 🙏 pic.twitter.com/thGsUoRLAG — Prithviraj Sukumaran (@PrithviOfficial) September 30, 2019 -
శుభాకాంక్షలు చెబుతారా?
గత ఏడాది హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బదాయి హో’. అంటే... శుభాకాంక్షలు అని అర్థం. కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అయిన చిత్రం ఇది. రెండొందల కోట్ల వసూళ్లు సాధించింది. అంతే... ఆయుష్మాన్‌కు బాలీవుడ్ అంతా బదాయిహో చెప్పింది. ఈ సినిమా తెలుగు, తమిళ రీమేక్ హక్కులను బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. తమిళంలో ఆయుష్మాన్ పాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించినట్టు సమాచారం. ధనుష్ కూడా సుముఖంగా ఉన్నారట. ప్రస్తుతం ధనుష్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఈ సినిమా మొదలుపెట్టనున్నారని టాక్. -
ధనుష్ చేతికి 'అర్జున్ రెడ్డి'
టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి సినిమాను తమిళనాట రీమేక్ చేయనున్నారు. తెలుగులో వివాదాలతో మంచి హైప్ క్రియేట్ అవ్వటంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు పోటి పడ్డాయి. అయితే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు చెందిన వుండర్ బార్ ఫిల్మ్స్ ఈ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తారా..లేదా.. దర్శకుడు ఎవరు..? అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్నా.. ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి మాత్రం అర్జున్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజమౌళి, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్స్ కూడా అర్జున్ రెడ్డి టీం ను అభినందించటంతో సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఇప్పటికే ఓవర్ సీస్ లో మిలియన్ మార్క్ ను దాటేసిన ఈ సినిమా సరికొత్త రికార్డ్ ల దిశగా దూసుకుపోతోంది. -
చిక్కుల్లో ‘క్వీన్’
చెన్నై: ప్రారంభానికి ముందే క్వీన్ చిత్రం చర్చనీయాంశనీయంగా మారింది. బాలీవుడ్లో సంచన విజయం సాధించిన చిత్రం క్వీన్. నటి కంగనారావత్ నటించిన ఈ చిత్రం ఆమె స్థాయిని పెంచడంతో పాటు అవార్డులను తెచ్చిపెట్టింది. అలాంటి చిత్రాన్ని దక్షిణాధి భాషలలో నిర్మించే హక్కులను సీనియర్ దర్శక నటుడు త్యాగరాజన్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో క్వీన్ పాత్రలో నటించే నటి ఎవరన్న విషయం ఆసక్తిగా మారింది. తొలుత మిల్కీబ్యూటీ తమన్నాను క్వీన్‌ను చేయాలని నిర్మాత వర్గం భావించింది. అయితే ఈ అమ్మడు అధిక పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో వేరే హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం భాషలో నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రానికి వానిల్ తేడి నిండ్రేన్ అనే టైటిల్‌ను నిర్ణయించి హీరోయిన్ ఎంపిక జరగకుండానే చిత్రీకరణను ప్రారంభించారు. నటుడు నాజర్ తదితరులు పాల్గొన్న కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదీ వివాదం కాగా గోల్డెన్ క్లబ్ ఫిలింస్ అనే లండన్‌కు చెందిన ప్రొడక్షన్ సంస్థ ఒక షాక్ ప్రకటనను విడుదల చేసింది. క్వీన్ చిత్ర దక్షిణాది భాషా చిత్రాల హక్కులు తమకు చెందినవనీ, తాను స్టార్ మూవీస్ సంస్థ అధినేత త్యాగరాజన్‌ను భాగస్వామిగా చేర్చుకున్నామనీ పేర్కొంది. క్వీన్ చిత్రం తమిళ, కన్నడ భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోందన్న విషయం తెలిసి తాము షాక్‌కు గురయ్యామనీ సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. క్వీన్ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులను తాము బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్(బీఎఫ్ఐ)లో రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఇందులో నటించే నటవర్గాన్ని తాము ఎంపిక చేసే పనిలోనే ఉన్నామన్నారు. ఈ వ్యవహారంపై తదుపరి ప్రకటనను త్వరలోనే వెల్లడిస్తామనీ పేర్కొన్నారు. దీంతో క్వీన్ చిత్రం చిక్కుల్లో పడినట్లయ్యింది. -
ఒప్పమ్ రీమేక్ రైట్స్ ‘ఓవర్ సీస్’కే
మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ - ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్. ఈ చిత్రం మలయాళంలో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో మూడు వారాల్లోనే 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి... దృశ్యం, ప్రేమమ్ చిత్రాల కలెక్షన్స్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. మలయాళ ప్రేక్షకులను ఇంతలా ఆకట్టుకున్న ఒప్పమ్ కథ ఏమిటంటే....ఈ చిత్రంలో మోహన్ లాల్ గుడ్డివాడిగా నటించారు. అయితే గుడ్డివాడైన మోహన్ లాల్ ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్మెంట్లో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ చేసిన కిల్లర్ తప్పించుకుంటాడు. అయితే....మర్డర్ చేసిన కిల్లర్‌ను గుడ్డివాడైన మోహన్ లాల్ ఎలా పట్టుకున్నాడు అనేది ఒప్పమ్ కథ. ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఆ పాయింట్ నచ్చడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కొంత మంది నిర్మాతలు ప్రయత్నించారు. అయితే...ఒప్పమ్ చిత్రం తెలుగు డబ్బింగ్‌తో పాటు రీమేక్ రైట్స్ ను ఓవర్ సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఓవర్ సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ అధినేత బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ అందిస్తుండడం విశేషం. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాల విజయాలతో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. దీంతో ఒప్పమ్ మూవీ పై టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించిన మోహన్ లాల్ ఒప్పమ్ తో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే...ఒప్పమ్ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తారా..? లేక రీమేక్ చేస్తారా అనేది త్వరలో తెలియచేయనున్నారు. -
రీమేక్ సినిమాతో మళ్లీ వస్తున్నాడు
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఇలా టాలీవుడ్ టాప్ హీరోలతో వరుస సినిమాలు చేసిన స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కొంత కాలంగా బ్రేక్ తీసుకున్నాడు. గత ఏడాది రిలీజ్ అయిన టెంపర్ సినిమా తరువాత గణేష్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. స్టార్ హీరోలంతా బిజీగా ఉండటంతో పాటు మంచి కథ కూడా దొరక్క పోవటంతో ఇండస్ట్రీగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో రీమేక్ సినిమాల సీజన్ నడుస్తుండటంతో గణేష్ కూడా ఓ సక్సెస్ ఫుల్ రీమేక్‌తో తిరిగి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే మలయాళంలో సూపర్ హిట్ అయిన 2 కంట్రీస్ సినిమా రైట్స్‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. దిలీప్, మమతా మోహన్‌దాస్‌లు జంటగా నటించిన ఈ సినిమాను తెలుగులో స్టార్ హీరోతో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. -
రీమేక్ కోసం... భలే భలే ఆఫర్లోయ్!
కాస్త కొత్తదనం ఉందనిపిస్తే చాలు... ఆ సినిమాని రీమేక్ చేసేందుకని వెంటనే కొని తీసుకెళుతుంటారు పొరుగు భాషల్లోని నిర్మాతలు. ఇక కొత్తదనంతో పాటు సూపర్ హిట్ సినిమా కూడా అనిపించుకుందంటే తిరుగేముంటుంది? రీమేక్ రైట్స్ విషయంలో మరింత క్రేజీ క్రేజీగా ఆఫర్లు వచ్చేస్తాయి. మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘భలే భలే మగాడివోయ్’ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. నాని, లావణ్యా త్రిపాఠీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ2, యు.వి. క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ రెండు నిర్మాణ సంస్థల అభిరుచి గురించి ఇప్పుడు ట్రేడ్ వర్గాలు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాయి. అసలే ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమ వెలిగిపోతోంది. ‘బాహుబలి’ తర్వాత కమర్షియల్ సినిమాల్లో ‘శ్రీమంతుడు’ ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తే... ఆ తర్వాత వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ మరో రకమైన ట్రెండ్‌ను సృష్టించింది. కామెడీతో కూడా బాక్సాఫీసు వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో కాసుల వర్షం కురిపించొచ్చని ఈ సినిమా నిరూపించింది. అమెరికాలో మిలియన్ మార్క్ వసూళ్లు సాధించిన తొలి నాన్‌స్టార్ సినిమాగా, మిడ్ బడ్జెట్ సినిమాగా రికార్డును సృష్టించింది. అల్లు అరవింద్ ప్రోత్సాహం తరణ్ ఆదర్శ్ లాంటి ప్రముఖ సినీ విశ్లేషకుడు తరచుగా ట్విట్టర్లో ‘భలే భలే మగాడివోయ్’ ఓవర్సీస్లో సాధిస్తున్న వసూళ్ల గురించి ట్వీట్ చేస్తుండ డంతో బాలీవుడ్, కోలీవుడ్ నుంచి రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలు వెంటబడు తున్నట్టు తెలిసింది. అయితే గీతా ఆర్ట్స్ సంస్థకి హిందీలోనూ, తమిళంలోనూ ఆమిర్‌ఖాన్, రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్స్‌తో సినిమాలు నిర్మించిన అనుభవం ఉంది కాబట్టి, ఆయా భాషల్లో వేరొక నిర్మాణ సంస్థతో కలిసి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ‘భలే భలే మగాడివోయ్’ని నిర్మించిన జీఏ2 సంస్థ గీతా ఆర్ట్స్‌కి అనుబంధ సంస్థ అన్న విషయం తెలిసిందే. జీఏ2 నిర్మాత బన్నీ వాసు కొత్త తరహా కాన్సెప్టులతో కూడిన సినిమాలు తీయడం వెనుక గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ప్రోత్సాహం ఎంతో ఉంది. బన్నీ వాసు, మారుతి, యూవీ క్రియేషన్స్ నిర్మా తల్లో ఒకరైన వంశీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్. పదిహేనేళ్లుగా మంచి స్నేహితులు. ఆ అనుబంధంతోనే జీఏ2, యువీ క్రియేషన్స్ చేతులు కలిపాయి. హీరోలకు కలిసొచ్చిన సంస్థ కథానాయకుల స్థాయిని పెంచే నిర్మాణ సంస్థగా యూవీ క్రియేషన్స్ గుర్తింపు పొందింది. ప్రభాస్ ‘మిర్చి’తో ప్రస్థానం ప్రారంభించిన యూవీ క్రియేషన్స్ తొలి అడుగుల్లోనే సంచలనాలు నమోదు చేస్తుండడం విశేషం. ఆ తర్వాత శర్వానంద్‌తో తీసిన ‘రన్ రాజా రన్’ కూడా సంచలన విజయం సాధించింది. శర్వానంద్‌పై పది కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసి అంతకు మించిన వసూళ్లు రాబట్టుకొంది. తమిళంలో ‘బాహుబలి’ని విడుదల చేసింది కూడా యూవీ క్రియేషన్సే. ఆ సినిమాకి తమిళంలో భారీ లాభాలొచ్చాయి. ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’ రూపంలో నాని కెరీర్లోనే అత్యంత భారీ సినిమా తీయడంతోపాటు, ఆయన కెరీర్లోనే అత్యంత భారీ విజయాన్ని అందించింది యూవీ క్రియేషన్స్. హీరోలకి కలిసొచ్చే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. -
లింగాపై స్టే కుదరదు
లింగా చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే సమయంలో ఆ చిత్రంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఫిర్యాదు చెన్నై హైకోర్టులో విచారణకు వచ్చింది. బాలాజీ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లింగా చిత్రానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. అందులో ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొంటూ తాము తెలుగులో చిరంజీవి, సోనాలిబింద్రే నటించిన ఇంద్ర చిత్రం తమిళ రీమేక్ హక్కులు పొందామని వెల్లడించారు. ఈ చిత్ర కథ రజనీకాంత్ నటించిన లింగా చిత్ర కథ ఒకేలా ఉన్నాయని తెలిపారు. ఇంద్ర ఇతివృత్తంతోనే లింగా చిత్రాన్ని రూపొందించారని పేర్కొన్నారు. లింగా చిత్రం విడుదలైతే తాము తీవ్రంగా నష్టపోతామని కాబట్టి ఆ చిత్ర విడుదలపై తాత్కాలిక నిషేధం విధించాలని కోరారు. అదే విధంగా ఒక లా కమిషన్ ఏర్పాటు చేసి లింగా చిత్రాన్ని ఇంద్ర చిత్రాన్ని చూసి కథ గురించి నిర్ణయం వెల్లడించేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసు మంగళవారం న్యాయమూర్తి ఆర్.సుబ్బయ్య సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ కేసులో లింగా చిత్ర దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ లింగా చిత్రానికి తాను దర్శకుడిని మాత్రమేనని వివరించారు. అయినా లింగా చిత్ర కథకు, తెలుగు చిత్రం ఇంద్ర కథకు సంబంధం లేదన్నారు. భారతదేశం లోని డ్యామ్‌ల ఇతివృత్తాన్ని తీసుకుని కథ, కథనాలను తయారు చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా పిటిషన్‌దారుడి ఉద్దేశం చూస్తుంటే లింగా చిత్రానికి సంబంధించిన వారందరినీ బెదిరించేలా ఉందని ఆరోపించారు. ఇరుతరపు వాదనలు విన్న న్యాయమూర్తి లింగా చిత్రంపై తాత్కాలిక నిషేధం విధంచడం కుదరదని వెల్లడిస్తూ కేసు విచారణ ఈ నెల 12కు వాయిదా వేశారు. -
'కత్తి' కోసం పవన్... నో అంటున్న విజయ్
వివాదాల నడుమ విడుదలై తమిళనాడులో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'కత్తి' చిత్రంపై టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ మనసు పారేసుకున్నట్లు సమాచారం. దాంతో పలువురు నిర్మాతలు ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కోలీవుడ్‌లో విజయ్- సమంత జంటగా నటించిన కత్తి చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దాంతో పలువురు తెలుగు నిర్మాతలు 'కత్తి' రీమేక్ హక్కుల కోసం ఆసక్తి చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే సినిమా ఒరిజినల్ హక్కులను ఇంత వరకు ఎవరికీ అమ్మలేదని ఆ చిత్ర నిర్మాతల సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమా రీమేక్‌పై హీరో విజయ్ కూడా సుముఖంగా లేడని, ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి త్వరలో విడుదల చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఫలిస్తాయా, కత్తిని చేతబడతారా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
బెంగళూరు డేస్...
‘బెంగళూరు డేస్’... అంజలీమీనన్ దర్శకత్వంలో, దుల్కేర్, ఫహాద్, నివీన్, నాజ్రియా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మలయాళ చిత్రం ప్రస్తుతం దక్షిణాదిన ఓ సెన్సేషన్. మలయాళ చిత్రసీమ రికార్డులన్నింటినీ తిరగరాసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందీ సినిమా. ‘బెంగళూరు డేస్’ హక్కుల కోసం ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలే పోటీకి దిగాయి. అయితే... ఈ సినిమా హక్కులను ప్రసాద్ పొట్లూరి, ‘దిల్’ రాజు కలిసి సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ హక్కులను కూడా వారే సొంతం చేసుకోవడం విశేషం. త్వరలోనే... ఈ మూడు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.