4 భాషల్లో మంజు వారియర్‌ సినిమా రీమేక్‌ | Manju Warrier Prathi Poovankozhi To Be Remade in 4 Languages | Sakshi
Sakshi News home page

4 భాషల్లో మంజు వారియర్‌ సినిమా రీమేక్‌

Published Sat, Oct 10 2020 3:15 PM | Last Updated on Sat, Oct 10 2020 3:49 PM

Manju Warrier Prathi Poovankozhi To Be Remade in 4 Languages - Sakshi

తిరువనంతపురం : ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్‌ ఇటీవల నటించిన చిత్రం ప్రతీ పూవన్‌కోజి. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీని తెలుగు, తమిళ్‌, కన్నడం,హిందీ భాషల్లో రీమేక్‌ చేయనున్నారు. హిందీలో ప్రతీ పూవన్‌కోజి సినిమాను బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన హిందీ రీమేక్‌ హక్కులను ఇప్పటికే బోనీ కపూర్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. అదే విధంగా తెలుగు, తమిళ్‌, కన్నడలో కూడా వివిధ ప్రొడక్షన్‌ హౌజ్‌లు రీమేక్‌ హక్కులను స్వాధీనం చేసుకున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. చదవండి: ఆర్చ... అదరహా

కథ రచయిత ఉన్ని ఆర్ రచించిన ‘సంకడం’ కథా ఆధారంగా ఈ సినిమాను రోషన్‌ ఆండ్సూస్‌ డైరెక్ట్‌ చేశారు. ప్రతీ పూవన్‌కోజి సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించడమే కాకుండా విలన్‌గా కూడా నటించారు. ఇది నటుడిగా రోషన్‌ తొలి సినిమా. కాగా వస్త్ర దుకాణంలో సేల్స్ వుమన్ పాత్ర పోషించిన మంజు వారియర్‌ ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. .మాధురి పాత్రలో లీనమై తనను బస్సులో వేధించిన ఓ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమా కథాంశం.  ప్రస్తుతం మంజు వారియర్‌ మోహన్‌లాల్‌ నటిస్తున్న మరక్కమ్‌ సినిమాలో కనిపించనున్నారు. చదవండి: డ్యాన్సర్‌పై కొరియోగ్రాఫర్‌ అనుచిత ప్రవర్తన..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement