
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మలయాళంలో అనూహ్య విజయం సాధించిన చిత్రం ‘ఉడుంబు’. అక్కడ ఈ చిత్రం పలు రికార్డులను సృష్టించింది. దీంతో ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం పలువురు తెలుగు దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరిచారు. పలు అగ్రనిర్మాణ సంస్థలు ‘ఉడుంబు’ రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. తెలుగు రీమేక్ రైట్స్ ఓ నిర్మాణ సంస్థ దక్కించుకుందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ పుకార్లపై తాజాగా ఉడుంబు చిత్ర దర్శకనిర్మాత కె.టి.తమరక్కుళం స్పందించారు. తెలుగు రీమేక్ రైట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
‘ఉడుంబు’ చిత్రాన్ని కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. భారీ తారాగణం లేకున్నా మలయాళంలో భారీ విజయం నమోదు చేసిన ‘ఉడుంబు’ చిత్రాన్ని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా... తమిళంలో ఓ సీనియర్ హీరోయిన్ తన తనయుడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రీమేక్ చేస్తున్నారు. మరి తెలుగు రీమేక్ హక్కులను ఎవరు సొంతం కానున్నాయో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment