Karan Johar Acquire Malayalam Movie Hridayam Rights: ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఓ మలయాళం బ్లాక్ బ్లస్టర్ హిట్ మూవీ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ సినిమా ఏంటంటే.. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హృదయం' చిత్రం. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్, దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సినిమా సోషల్ మీడియాతోపాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ మనసు గెలుచుకుంది ఈ మూవీ. దీంతో ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుుకన్నారు.
సోషల్ మీడియా వేదికగా 'నేను మీతో ఈ వార్తను పంచుకోవడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ అండ్ ఫాక్స్ స్టార్ స్డూడియోస్ మలయాళం న్యూ ఏజ్ ప్రేమకథా చిత్రం హృదయం సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల హక్కులను పొందాయి.' అని కరణ్ జోహార్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్, అలియా భట్‌లు హీరోహీరోయిన్లుగా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో జయా బచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర కూడా నటించున్నారని సమాచారం.
I am so delighted and honoured to share this news with you. Dharma Productions & Fox Star Studios have acquired the rights to a beautiful, coming-of-age love story, #Hridayam in Hindi, Tamil & Telugu – all the way from the south, the world of Malayalam cinema. pic.twitter.com/NPjIqwhz8l
— Karan Johar (@karanjohar) March 25, 2022
Comments
Please login to add a commentAdd a comment