ధనుష్ చేతికి 'అర్జున్ రెడ్డి' | Dhanush bags Arjun Reddys remake rights | Sakshi
Sakshi News home page

ధనుష్ చేతికి 'అర్జున్ రెడ్డి'

Published Sat, Sep 2 2017 1:19 PM | Last Updated on Tue, Sep 19 2017 12:58 PM

ధనుష్ చేతికి 'అర్జున్ రెడ్డి'

ధనుష్ చేతికి 'అర్జున్ రెడ్డి'

టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి సినిమాను తమిళనాట రీమేక్ చేయనున్నారు. తెలుగులో వివాదాలతో మంచి హైప్ క్రియేట్ అవ్వటంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు పోటి పడ్డాయి. అయితే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు చెందిన వుండర్‌ బార్‌ ఫిల్మ్స్‌ ఈ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తారా..లేదా.. దర్శకుడు ఎవరు..? అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు.

ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్నా.. ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి మాత్రం అర్జున్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజమౌళి, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్స్ కూడా అర్జున్ రెడ్డి టీం ను అభినందించటంతో సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఇప్పటికే ఓవర్ సీస్ లో మిలియన్ మార్క్ ను దాటేసిన ఈ సినిమా సరికొత్త రికార్డ్ ల దిశగా దూసుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement