
ధనుష్
గత ఏడాది హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బదాయి హో’. అంటే... శుభాకాంక్షలు అని అర్థం. కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అయిన చిత్రం ఇది. రెండొందల కోట్ల వసూళ్లు సాధించింది. అంతే... ఆయుష్మాన్‌కు బాలీవుడ్ అంతా బదాయిహో చెప్పింది.
ఈ సినిమా తెలుగు, తమిళ రీమేక్ హక్కులను బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. తమిళంలో ఆయుష్మాన్ పాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించినట్టు సమాచారం. ధనుష్ కూడా సుముఖంగా ఉన్నారట. ప్రస్తుతం ధనుష్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఈ సినిమా మొదలుపెట్టనున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment