
దక్షిణాదిలో ఘన విజయం సాధించిన సినిమాలు ఉత్తరాదిలో.. అక్కడ సక్సెస్ అయిన సినిమాలు సౌత్‌లో రీమేక్ అవ్వటం తరుచూ జరుగుతుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్‌లు క్వీన్, పింక్ సినిమాలు సౌత్‌లో రీమేక్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సూపర్ హిట్ సినిమా చేరింది. గత ఏడాది బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ‘బదాయి హో’.
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బదాయి హో ఘన విజయం సాధించటమే కాదు, 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా సౌత్ రీమేక్ హక్కులు సొంత చేసుకున్న బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దక్షిణాదిలో అన్ని భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అమిత్ షా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా దక్షిణాదిలో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment