
హీరో ధనుష్, హీరోయిన్ శ్రుతీహాసన్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘3’ (2012) సినిమాలో తొలిసారి జంటగా నటించారు ధనుష్, శ్రుతి. ఆ చిత్రం విడుదలైన 12 ఏళ్లకి మరోసారి ఈ జోడీ రిపీట్ కానుందని టాక్. శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి తాజాగా ధనుష్‌తో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు.
వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ మూవీలో ధనుష్‌కి జంటగా శ్రుతీహాసన్ నటించనున్నట్లు తెలుస్తోంది. పైగా డైరెక్టర్‌పై ఉన్న నమ్మకంతో తన పాత్ర ఏంటి? అని అడగకుండానే ఓకే చెప్పారట ఆమె. తన కెరీర్‌లో ఇప్పటి వరకూ చేయని ఓ వైవిధ్యమైన పాత్ర శ్రుతీహాసన్‌ది అని టాక్. ‘3’ మూవీతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ధనుష్–శ్రుతీహాసన్ రెండోసారి జంటగా నటించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింVŠ తో బిజీగా ఉన్నారు శ్రుతి. ఆ మూవీ పూర్తయ్యాక ధనుష్ చిత్రంలో పాల్గొంటారని కోలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment