హృదయానికి హత్తుకునే విధంగా... | Vijay's Kaththi Release Date Confirmed | Sakshi
Sakshi News home page

హృదయానికి హత్తుకునే విధంగా...

Published Sun, Oct 19 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

హృదయానికి హత్తుకునే విధంగా...

హృదయానికి హత్తుకునే విధంగా...

 ‘‘టైటిల్ ‘కత్తి’ కదా అని, ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అనుకుంటే పొరపాటే. ఇందులో యాక్షన్ మాత్రమే కాదు... సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటాయి’’ అని  ‘ఠాగూర్’ మధు చెప్పారు. ఆయన సమర్పణలో  కె. కరుణామూర్తి, ఎ. శుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించిన ‘కత్తి’ చిత్రం లైకా ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై తెలుగులో విడుదల కానుంది. విజయ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి ‘కొలవెరి’ ఫేమ్ అనిరుధ్ స్వరాలందించారు. పాటలను ఈ నెల 24న, చిత్రాన్ని 31న విడుదల చేయనున్నారు.
 
 ఈ సందర్భంగా ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ - ‘‘‘తుపాకి’ తర్వాత విజయ్,  మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం చక్కని యాక్షన్ థ్రిల్లర్. మురుగదాస్ ఏ తరహా సినిమా చేసినా వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తారు. చాలా విభిన్నమైన కథాంశంతో హార్ట్ టచింగ్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. పాటలకూ మంచి స్కోప్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్ ముఖేష్ కీలకపాత్ర చేసిన ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: ఎ. శ్రీకర్‌ప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement