23న పాటలు, 31న ‘కత్తి’ విడుదల
23న పాటలు, 31న ‘కత్తి’ విడుదల
Published Wed, Oct 15 2014 6:20 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM
తుపాకి’ చిత్రం తర్వాత హీరో విజయ్-దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘కత్తి’. సమంత కథానాయిక. ‘కొలవెరి’ ఫేమ్ అనిరుధ్ స్వరాలందించారు. కె. కరుణామూర్తి, ఎ. శుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 23న పాటలు, 31న సినిమా విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ -‘‘ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. హైఓల్టేజ్ యాక్షన్‌తో పాటు సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్‌లకు మంచి ప్రాధాన్యముంది.
మురుగదాస్ ఏ తరహా సినిమా చేసినా వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తారు. చాలా విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా చేశారు. చాలా హార్ట్ టచింగ్ మూవీ ఇది. పాటలకూ మంచి స్కోప్ ఉంది. దీపావళి కానుకగా తెలుగు వెర్షన్ పాటలను విడుదల చేస్తున్నాం. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్ ముఖేష్ కీలకపాత్ర చేసిన ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: ఎ. శ్రీకర్‌ప్రసాద్.
Advertisement
Advertisement