గీతాంజలి జువెల్లరీ (ఫైల్ ఫోటో)
ముంబై : పీఎన్‌బీ-నీరవ్ మోదీ మోసపూరిత కేసులో భాగమైన గీతాంజలి గ్రూప్ వెబ్‌సైట్ షట్‌డౌన్ అయ్యింది. వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే 'మెయింటన్స్ మోడ్'లో ఉన్నట్టు ఓ మెసేజ్ దర్శనిస్తోంది. '' ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రస్తుతం తమ వెబ్‌సైట్ షెడ్యూల్ చేయబడిన నిర్వహణలో ఉంది. అర్థం చేసుకునందుకు ధన్యవాదాలు'' అనే మెసేజ్ ఈ వెబ్‌సైట్‌పై కనబడుతోంది. గతవారం చివరి వరకు ఈ వెబ్‌సైట్ మామూలుగానే పనిచేసింది. అయితే ఎప్పుడు ఈ వెబ్‌సైట్ పనిచేయడం ఆగిపోయిందో స్పష్టంగా తెలియరావడం లేదు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ సీబీఐ, ఈడీ అధికారుల కనుసన్నల్లో ఉంది.
గీతాంజలి గ్రూప్‌కు యజమాని మెహుల్ చౌక్సి. డైమాండ్ కింగ్ నీరవ్ మోదీకి ఈయన మేనమామ. రూ.11,400 కోట్ల పీఎన్‌బీ స్కాంకు పాల్పడిన వారిలో నీరవ్ మోదీతో పాటు మెహుల్ చౌక్సి కూడా ఉన్నారు. 2011లోనే ఈ స్కాం ప్రారంభమైనట్టు తెలిసింది. కానీ ఈ ఏడాది జనవరి మూడో వారంలో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. తమ బ్యాంకు ముంబై బ్రాంచులో భారీ ఎత్తున్న స్కాం జరుగుతున్నట్టు పీఎన్‌బీఐ ఉన్నతాధికారులు గుర్తించారు. అంతర్గత విచారణ జరిపిన అనంతరం సీబీఐకి, స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపారు. అయితే ఈ స్కాం బయటికి రాకముందే, కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీ, మెహుల్ చౌక్సి విదేశాలకు చెక్కేశారు.
Comments
Please login to add a commentAdd a comment