
రాజిరెడ్డి మృతదేహం
సాక్షి, దోమకొండ: దోమకొండ మండలం గొట్టిముక్కుల గ్రామానికి చెందిన రైతు ధర్పల్లి రాజిరెడ్డి(46) మంగళవారం సాయంత్రం అప్పుల బాధతో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రాజిరెడ్డికి గ్రామ శివారులో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో మొక్కజొన్న సాగు చేశాడు. అకాల వర్షాలతో పంట దెబ్బతింది. వచ్చిన పంటను తక్కువ ధరకు అమ్ముకున్నాడు. దీనికి తోడు ఇటీవల నెల క్రితం రాజిరెడ్డి కుమారుడు సాగర్‌కు యాక్సిడెంట్ కాగా ఆస్పత్రిలో దాదాపు రూ.మూడు లక్షల వరకు ఖర్చయింది. దీంతో మానసికంగా కృంగిపోయిన రాజిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కుమారులు సాగర్, సంపత్ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment