
ప్రతీకాత్మకచిత్రం
బీబీపేట: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అత్యాచారం, హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజారాం తెలిపిన వివరాలు.. బాధిత మహిళ జనగామ గ్రామానికి చెందిన గణేశ్‌కు గతంలో అప్పు ఇచ్చింది. దానిని తిరిగి ఇవ్వమన్నందుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సదరు మహిళ సిద్దిపేట జిల్లా భూంపల్లి దగ్గర నుంచి బీబీపేటకు రావడానికి బస్టాండ్‌లో ఎదురుచూస్తుండగా గణేశ్ తన బైక్‌పై తీసుకు వెళ్తానని నమ్మించాడు.
దారిలో బైక్ ఆపి పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను కొట్టి బంగారు నగలు తీసుకొని పారిపోయాడు. బాధితురాలు బంధువుల సాయంతో ఇంటికి చేరుకొని ఆస్పత్రికి వెళ్లింది. గురువారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment