gottimukkala
-
గొట్టిముక్కల ఎగువన రెండు జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా గొట్టిముక్కలకు ఎగువన లోయ తరహాలో ఉన్న ప్రాంతాల్లో రెండు జలాశయాలను నిర్మించాలని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలను కేటాయించారని.. కానీ ఆ నీటితో ప్రతిపాదించిన 5.30 లక్షల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే 3 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ–2 ద్వారా నీళ్లు అందుతున్నాయని వివరించింది. అందువల్ల ఈ 45 టీఎంసీల నీటిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి రెండు జలాశయాలను నిర్మించాలని కోరింది.గోదావరి–కావేరి అనుసంధానంపై శుక్రవారం జలసౌధలో తెలంగాణతో ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం నిర్వహించింది. ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీఈ దేవేందర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్, రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్ పాల్గొన్నారు. భేటీలో రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. అనుసంధానం ప్రాజెక్టుపై రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటి సరఫరా కోసం 250 టీఎంసీలు అవసర మని చెప్పారు. అందువల్ల ప్రాజెక్టు ద్వారా తరలించే నీటిలో 50 శాతాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు.రాష్ట్రం చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవీ..⇒ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీటి తరలింపు కోసం ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని మా అధ్యయనంలో తేలింది. సమ్మక్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలి. రాష్ట్ర అవసరాల కోసం సమ్మక్క బరాజ్‌లో 83 మీటర్ల వరకు నిల్వలను సంరక్షిస్తూ ఆపై నిల్వలను మాత్రమే తరలించాలి. తెలంగాణకు సీతమ్మసాగర్ ప్రాజెక్టు కింద 70 టీఎంసీలు, సమ్మక్క ప్రాజెక్టు కింద 50 టీఎంసీలు, దేవాదుల కింద 38 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీల అవసరాలు ఉన్నాయి. వాటిని సంరక్షించాలి. సీతమ్మ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి అవసరమైన కనీస నిల్వలను కాపాడాలి.⇒ సమ్మక్క బరాజ్‌లో 87 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే ఛత్తీస్‌గఢ్‌లో జరిగే ముంపు విషయంలో ఆ రాష్ట్రాన్ని ఒప్పించే బాధ్యతను ఎన్‌డబ్ల్యూడీఏ తీసుకోవాలి. ఛత్తీస్‌గఢ్ వాడుకోకపోవడంతో మిగిలే 148 టీఎంసీల గోదావరి జలాలను గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించనున్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై ఆ తర్వాతే సంతకాలు చేస్తాం.⇒ అనుసంధానం ప్రాజెక్టులో కాల్వలు, సొరంగాల కోసం సేకరించాల్సిన భూముల్లో రెండు పంటలు పండే ఆయకట్టు భూములున్నాయి. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రం నిర్మించనున్న కాల్వల వ్యవస్థనే అనుసంధానం ప్రాజెక్టు అవసరాలకూ వాడుకోవాలి.⇒అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి కావేరికి తరలించాలని ప్రతిపాదించారు. అయితే కీలకమైన కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు వచ్చే వరకు సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోరాదు. సాగర్ నిర్వహణ ప్రొటోకాల్‌తోపాటు ఏపీ, తెలంగాణలకు నీటి కేటాయింపులపై స్పష్టత వచ్చాకే ఈ విషయంలో ముందుకు వెళ్లాలి.50 శాతం వాటా మినహా మిగతావి ఓకే: ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్అనుసంధానం ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో తెలంగాణకు 50 శాతం కేటాయించాలనే డిమాండ్ విషయంలో పట్టువీడాలని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ కోరారు. రెండు కొత్త జలాశయాల నిర్మాణం, సమ్మక్క బరాజ్ నుంచే నీటి తరలింపు, ఛత్తీస్‌గఢ్ నుంచి సమ్మతి తీసుకోవడం తదితర అంశాలన్నింటి పట్ల సానుకూలంగా ఉన్నామని తెలిపారు. తదుపరి చర్చల్లో ఈ అంశాలపై మరింత పురోగతి సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎంఓయూ చేసుకోవాలని కోరారు.గౌరవెల్లి కాల్వల పనులకు అనుమతిసాక్షి, హైదరాబాద్: శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు–ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఐఎఫ్ఎఫ్సీ) ప్రాజెక్టులోని ప్యాకేజీ– 7లో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లను తరలించే కాల్వల నిర్మాణం కోసం రూ.431.30 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన అనుమ తులు జారీ చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధి లోని 1,06,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ఈ పనులు చేపట్టనున్నారు. భూసేకరణలో పురోగతితో సంబంధం లేకుండా మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, దోమకొండ: దోమకొండ మండలం గొట్టిముక్కుల గ్రామానికి చెందిన రైతు ధర్పల్లి రాజిరెడ్డి(46) మంగళవారం సాయంత్రం అప్పుల బాధతో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రాజిరెడ్డికి గ్రామ శివారులో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో మొక్కజొన్న సాగు చేశాడు. అకాల వర్షాలతో పంట దెబ్బతింది. వచ్చిన పంటను తక్కువ ధరకు అమ్ముకున్నాడు. దీనికి తోడు ఇటీవల నెల క్రితం రాజిరెడ్డి కుమారుడు సాగర్‌కు యాక్సిడెంట్ కాగా ఆస్పత్రిలో దాదాపు రూ.మూడు లక్షల వరకు ఖర్చయింది. దీంతో మానసికంగా కృంగిపోయిన రాజిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కుమారులు సాగర్, సంపత్ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు. -
అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు
నల్గొండ : పాఠశాలలో మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. డీఈవో విశ్వనాథరావు శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవరకొండ మండలం గొట్టిముక్కల ప్రాధమికోన్నత పాఠశాలలో గురువారం హలీం అనే ఉపాధ్యాయుడు వీరంగం సృష్టించిన ఉదంతాన్ని పత్రికులు, టీవీ ఛానళ్లలో రావటంతో విద్యాశాఖ మంత్రితో పాటు, ఉన్నతాధికారులు ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో జిల్లా విద్యాశాఖ టీచర్ తతంగంపై నివేదిక తయారు చేసి సస్పెండ్ చేసింది. -
చిత్తుగా తాగి...మూత్ర విసర్జన చేసి...
నల్గొండ : ఆదర్శవంతంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడు పవిత్ర వృత్తికి కళంకం తెచ్చాడు. పాఠశాలలో మూత్రం పోసి వీరంగం సృష్టించాడు. మద్యం సేవించి విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తించాడు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గొట్టిముక్కల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న హలీం తన స్నేహితులతో మద్యం తెప్పించుకుని పూటుగా తాగాడు. మైకం కమ్మడంతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థులపై చేయి చేసుకుని అడ్డుగా వచ్చిన ప్రధానోపాధ్యాయుడిపై తిరగబడ్డాడు. రిజిస్టర్లు చించి, సహచర టీచర్ల బైక్‌లలోని గాలి తీసి విచ్చలవిడిగా ప్రవర్తించాడు. మైకంలో కదలలేని స్థితిలో తరగతి గదిలోనే మూత్రం పోశాడు. గొడవ జరగటంతో గ్రామస్తులు వచ్చేలోపే ఆ ఉపాధ్యాయుడు పరారయ్యాడు. ఈ ఘటనపై డీఈవో విశ్వనాథం స్పందిస్తూ ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అయితే ఈ సంఘటపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. కాగా హలీం గతంలో మద్యం సేవించి హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. -
ఇప్పడు అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం!!
అది కృష్ణా జిల్లా గొట్టిముక్కల గ్రామం. ఇప్పుడు అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎప్పుడూ పదిమంది నోళ్లలో నాలుకలా మెలుగుతూ పనే దైవంగా భావించే ఆ గ్రామ ఉప సర్పంచి ఎ.కృష్ణారావు దారుణహత్యకు గురికావడం ఆ ఊరు మొత్తాన్ని మూగనోము పట్టేలా చేసింది. అదివారం రాత్రిపూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన కృష్ణారావు ఇంట్లోకి కొంతమంది దుండగులు కృష్ణారావు ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఆయనను బయటకు లాక్కొచ్చి, పొడిచి పొడిచి చంపేశారు. తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని అంతకుముందే కృష్ణారావు పోలీసులకు పదే పదే విజ్ఞప్తులు చేసినా వాళ్లు పెడచెవిన పెట్టారు. ఇక దాడి జరుగుతున్న సమయంలో ఆయన భార్య, పిల్లలు చంపొద్దు.. వదిలేయాలని కాళ్లా వేళ్లా పడి బతిమాలినా ఆ దుండగులు ఏమాత్రం కనికరించలేదు. ఇంత దారుణ సంఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. హత్యకు పాల్పడినట్లు చెబుతున్న నిందితులు తమంతట తాము లొంగిపోయేవరకు పోలీసులు నిష్క్రియాపరత్వంతో వ్యవహరించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసుల పక్షపాతం స్పష్టంగా తెలుస్తోందని, వాళ్లు కావాలనే ఊరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్షం ఉండటంతో ఎలాగైనా వాళ్లను అణగదొక్కాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ దారుణమైన హత్యారాజకీయాలకు పాల్పడుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 19 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. బత్తాయి తోటలు, బొప్పాయి తోటలు.. అన్నింటినీ విచ్చలవిడిగా నరికేశారు. ప్రధానంగా టీడీపీ ఓటమి పాలైన ప్రాంతాల్లోనే ఈ తరహా దాడులు ఎక్కువగా జరిగాయి. గ్రామ పంచాయతీల నుంచి జిల్లా పరిషత్తుల వరకు ప్రతిదాన్నీ సొంతం చేసుకోడానికి టీడీపీ సామ దాన భేద దండోపాయాలు అన్నింటినీ ప్రదర్శించింది. గొట్టిముక్కలలో కూడా కృష్ణారావు హత్య తర్వాత సీతయ్య, సెల్వరాజ్ అనే మరో ఇద్దరు కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఇప్పుడక్కడ అంతా భయమే రాజ్యమేలుతోంది. దివిసీమ ప్రాంతంలోని అవనిగడ్డలో.. టీడీపీ గూండాలు మందుగుండు సామగ్రి పేలుస్తుంటే, పిల్లలు భయపడతారని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి తల మీద బాంబు పెట్టి పేల్చి చంపేశారు! అతడు చేసిన పాపమల్లా.. టీడీపీ గూండాల ఆదేశాలు కాదని తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడమే. ఇలాంటి ఘోరాలు ఎన్ని జరుగుతున్నా పోలీసులు మాత్రం మౌన ప్రేక్షక పాత్రనే పోషిస్తున్నారు. పాలకపక్షం ఊదుతున్న బూరాలకు బుట్టలోని పాముల్లా ఆడుతున్నారు. -
'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య'
విజయవాడ : గొట్టిముక్కల ఉప సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ నేత కృష్ణారావు హత్యను ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తీవ్రంగా ఖండించారు. కృష్ణారావుకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని గతంలోనే జిల్లా ఎస్పీని కోరామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే ఈ హత్య జరిగిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం, మంత్రి దేవినేని ఉమా కలిసి చేసిన హత్య అని ఆయన ఆరోపించారు. -
కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత హత్య
గొట్టిముక్కల : పాత కక్షలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు కృష్ణారావు ఇంటిపై దాడి చేసి...అతన్ని నరికి చంపారు. కాగా టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.