ఆక్వాపార్క్ ఏర్పాటుతో మా పొట్ట కొట్టొద్దు
– చింతరేవులో మహిళలు వినూత్న నిరసన
మొగల్తూరు : తుందుర్రులో ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేసి తమ పొట్ట కొట్టవద్దంటూ మంగళవారం చింతరేవుకు చెందిన మహిళలు ఉరికి వేలాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి గొంతేరు డ్రెయిన్‌పై ఆధారపడి వేటే జీవనాధారంగా జీవిస్తున్నామన్నారు. తల్లిలాంటి గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యం బారిన పడవేసేందుకు తుందుర్రు ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారన్నారు. పరిశ్రమ నుంచి ఏర్పడే రసాయనాల కారణంగా మత్స్య సంపదను కోల్పోయి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. ఆక్వా పరిశ్రమ పనులు తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి అనంతలక్ష్మి, మంగ, సన్యాసమ్మ, మొగదారమ్మ, చంద్రకళ,పెద్దింట్లమ్మ, వాటాల అనసూయ, కొల్లాటి కష్ణమూర్తి, బర్రి ధనలక్ష్మి, కొప్పాడ నాగలక్ష్మి, బర్రి వెంకటేశ్వర్లు, పోతాబత్తుల కష్ణమూర్తి, వాటాల నర్సింహరావు, వాటాల బాలకష్ణ, గంగరాజు పాల్గొన్నారు.