![Women Suicide within One year of marriage Suspected Dowry Death - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/18/ktk.jpg.webp?itok=mqTKuwzv)
కోలారు: తాలూకాలోని కల్వమంజలి గ్రామంలో ఉరివేసుకున్న స్థితిలో చైత్ర (25) అనే వివాహిత శవమైంది. ఆమె భర్త వెంకటేష్ నరసాపురం పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కంపెనీలో కార్మికుడు. అతడు డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన సమయంలో భార్య ఇంట్లో ఉరికి వేలాడుతోంది. వీరికి యేడాది క్రితమే పెళ్లయింది.
కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించేవారని తెలిసింది. వారే హత్య చేశారని మృతురాలి అక్క శ్వేత ఆరోపిస్తోంది. ఘటన తరువాత భర్త, కుటుంబీకులు పరారయ్యారు. సిఐ శివరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment