వివాహాలకు సంబంధించి పలు దేశాల్లో పలు ఆచారాలు ఉంటాయి. కొన్ని చూడటానికి, వినటానికి చాలా వింతగా ఉంటాయి. ఎంతలా అంటే..ఇదేం ఆచారం రా ! బాబు అని నోటిపై వేలేసుకునేలా ఉంటాయి. పైగా వాళ్లు ఆ ఆచారాలను చాలా నిబద్ధతతో ఆచరించడం మరింత విస్తుపోయేలా ఉంటుంది. ఇంతకీ ఈ గమ్మతైన వింత ఆచారం ఏదేశంలో ఉంది? ఏంటా వింత ఆచారం అంటే..?
ఇలాంటి వింత ఆచారాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ ఏరిత్రియ అనే తెగ ఒకటి ఉంది. ఈ తెగల ప్రజలు వివాహ సమయంలో చాలా వింతైన ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తారు. సాధారణంగా ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకునే ఆచారమే ఏ సంప్రదాయంలోనైనా ఉంటుంది. కానీ ఇక్కడ సంప్రదాయంలో మాత్రం ఇద్దరు మహిళలను తప్పనిసరిగా వివాహం చేసుకోవాలట. ఏంటీ బై వన్ గెట్ వన్ ఆఫర్ అనుకుంటున్నారా..? కానీ ఆఫ్రికా ఖండంలోని ఈ ఎరిత్రియ తెగ మాత్రం ఈ సంప్రదాయన్ని నేటికి పాటిస్తోంది.
ఒక వేళ అలా గనుకు ఎవరైన చేయకపోతే దాన్ని అతిపెద్ద నేరంగా పరిగణించి వారిని జైల్లో వేయిస్తారట. అందేకాదండోయ్ ఏకంగా జీవత ఖైదు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందట. అందువల్లే అక్కడ ప్రాంతంలోని ప్రతి స్త్రీ కూడా తన భర్తను మరో స్త్రీతో పంచుకునేందుకు రెడీ అవుతుందట. అయితే ఈ తెగలో దశాబ్దకాలంగా పురుషుల కంటే స్త్రీ జనాభానే ఎక్కువగా ఉటుందట. దీంతో ఆ తెగ పెద్దలు స్త్రీ-పురుషుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నారట.
(చదవండి: ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం!ఆస్తుల జాబితా వింటే షాకవ్వుతారు!)
Comments
Please login to add a commentAdd a comment