ఆమెకు ఆరేళ్లలో ఏడు వివాహాలు!.. కోర్టు ఆగ్రహం.. వీడియో వైరల్‌ | Women Seventh Divorce Hearing Leaves Judge Astonished In Karnataka Court | Sakshi
Sakshi News home page

ఆమెకు ఆరేళ్లలో ఏడు వివాహాలు!.. కోర్టు ఆగ్రహం.. వీడియో వైరల్‌

Jul 30 2024 3:23 PM | Updated on Jul 30 2024 4:10 PM

Women Seventh Divorce Hearing Leaves Judge Astonished In Karnataka Court

ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కావాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణం ఆమె ఇప్పటి వరకు ఏడుగురిని వివాహం చేసుకుంది. ఆరుగురు భర్తల నుంచి ఏదో ఒక సాకు చూపించడం వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. ఈ సారి తన ఏడవ భర్త నుంచి న్యాయం చేయాలని కోరడంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి మహిళ చట్టాన్ని తారుమారు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  విచారణ సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విచారణ సందర్భంగా న్యాయమూర్తి.. తన ఏడవ భర్త నుంచి విడాకులు కోరడంపై కేసును విచారిస్తున్న న్యాయవాదిని పలు ప్రశ్నలు సంధించారు. ఆమె ఏడుగురు భర్తలపై సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు.

న్యాయవాది స్పందిస్తూ..‘అవును, వివాహిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు సెక్షన్ 498ఏ కింద వారందరిపై కేసు నమోదైంది. అదనంగా నిర్వహణ కోసం డబ్బులు కావాలని కోరడంతో..అప్పుడు న్యాయమూర్తి ప్రతి భర్తతో ఎంతకాలం ఉన్నారని అడిగారు. విడాకులు తీసుకునే ముందు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఉన్నట్లు సమాధానం చెప్పింది. అదే సమయంలో సదరు మహిళ సెటిల్‌ మెంట్‌ కోసం భారీ మొత్తంలో డబ్బులు అడిగినట్లు న్యాయమూర్తి గుర్తించారు. దీంతో సదరు మహిళ చట్టాన్ని తారుమారు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడమంటే.. అందులో మీ తప్పే కనిపిస్తోందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement