High Court Bar Council
-
‘సుప్రీం’ తీర్పుతో 16 ఏళ్లకు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం
న్యూఢిల్లీ: సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు చొరవతో ఆ కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం లభించింది. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరు వారాల్లోగా ఆ కానిస్టేబుల్ కుమారునికి ప్రభుత ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.వివరాల్లోకి వెళితే యూపీలోని అలీఘర్ నివాసి వీరేంద్ర పాల్ సింగ్ తండ్రి శిశుపాల్ సింగ్ యూపీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయన 1995లో అనారోగ్యంతో మరణించాడు. ఆ సమయంలో అతని కుమారుడు వీరేంద్ర పాల్ సింగ్ మైనర్ కావడంతో, అతని తల్లి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.అయితే 13 సంవత్సరాల తరువాత మేజర్ అయిన వీరేంద్ర పాల్ సింగ్ 2008లో కారుణ్య నియామకం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో జాప్యం జరిగిన కారణంగా యూపీ ప్రభుత్వం ఆ దరఖాస్తును తిరస్కరించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరేంద్ర పాల్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై పునర్విచారణ జరపాలని హైకోర్టు సింగిల్ బెంచ్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాన్ని యూపీ ప్రభుత్వం పునరాలోచన చేసి, తిరస్కరించింది.కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయడంలో జరిగిన జాప్యాన్ని మన్నించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇలా కోర్టులో వాదప్రతివాదనలతో చాలా ఏళ్లు గడిచిపోయాయి. అయితే 2021లో అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా వీరేంద్రకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై పరిశీలించాలని కోరింది. యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. అయితే అది 2022లో దానిని తిరస్కరణకు గురయ్యింది. అతని కారుణ్య నియామకాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.దీనిపై యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టులో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సందీప్ మెహతాలు.. యూపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ, హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో తమకు లోపం కనిపించలేదని పేర్కొన్నారు. ఎటువంటి తప్పు లేకుండా 2010 సంవత్సరం నుండి ఈ కేసును కొనసాగిస్తున్నారని, తాము ఈ అప్పీల్‌ను స్వీకరించడానికి ఇష్టపడటం లేదని, దీనిని కొట్టివేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ ఉత్తర్వు కాపీ అందిన నాటి నుంచి ఆరు వారాల వ్యవధిలోగా ప్రతివాదికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానిస్టేబుల్ కుమారుని తరపున న్యాయవాది వంశజా శుక్లా వాదనలో పాల్గొన్నారు. కాగా కానిస్టేబుల్ శిశుపాల్ సింగ్ 1992లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అనారోగ్యానికి గురై, చికిత్స పొందుతూ కన్నుమూశాడు.ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
ఆమెకు ఆరేళ్లలో ఏడు వివాహాలు!.. కోర్టు ఆగ్రహం.. వీడియో వైరల్
ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కావాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణం ఆమె ఇప్పటి వరకు ఏడుగురిని వివాహం చేసుకుంది. ఆరుగురు భర్తల నుంచి ఏదో ఒక సాకు చూపించడం వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. ఈ సారి తన ఏడవ భర్త నుంచి న్యాయం చేయాలని కోరడంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి మహిళ చట్టాన్ని తారుమారు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విచారణ సందర్భంగా న్యాయమూర్తి.. తన ఏడవ భర్త నుంచి విడాకులు కోరడంపై కేసును విచారిస్తున్న న్యాయవాదిని పలు ప్రశ్నలు సంధించారు. ఆమె ఏడుగురు భర్తలపై సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు.న్యాయవాది స్పందిస్తూ..‘అవును, వివాహిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు సెక్షన్ 498ఏ కింద వారందరిపై కేసు నమోదైంది. అదనంగా నిర్వహణ కోసం డబ్బులు కావాలని కోరడంతో..అప్పుడు న్యాయమూర్తి ప్రతి భర్తతో ఎంతకాలం ఉన్నారని అడిగారు. విడాకులు తీసుకునే ముందు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఉన్నట్లు సమాధానం చెప్పింది. అదే సమయంలో సదరు మహిళ సెటిల్ మెంట్ కోసం భారీ మొత్తంలో డబ్బులు అడిగినట్లు న్యాయమూర్తి గుర్తించారు. దీంతో సదరు మహిళ చట్టాన్ని తారుమారు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడమంటే.. అందులో మీ తప్పే కనిపిస్తోందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు. SERIAL 498A ACCUSER A WOMAN IN KARNATAKA HAS MARRIED 7 TIMESSTAYED WITH EACH MAX 1 YEARFILED 498A, MAINTENANCE CASES ON ALLTAKEN MONEY FROM 6 HUSBANDSNOW FIGHTING CASE WITH 7TH Despite having all records with him, MiLord not sending her to JailJAI HO EQUALITY 🙏 pic.twitter.com/3zpdBFNP1m— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 26, 2024 -
కశ్మీర్లో స్తంభించిపోయిన ‘న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ‘ప్రజా భద్రతా చట్టం’ కింద అరెస్టయిన వేలాది మంది యువకులు గత నెల పదిహేను రోజులుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. రాష్ట్రంలోని జైళ్లు సరిపోకపోవడంతో వేలాది మందిని ఇరుగు, పొరుగు రాష్ట్రాలకు కూడా తరలించిన విషయం తెల్సిందే. వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఊచలు లెక్క పెడుతున్నారు. వారు తమ ఆరెస్టులను సవాల్ చేసేందుకు కోర్టులకు వెళ్లే ఆస్కారం కూడా లేకుండా పోయింది. కోర్టుల తలుపులు ఇప్పటికీ తెరచుకోవడం లేదు. ఇదేమిటిని ప్రశ్నించేందుకు న్యాయవాదులు కూడా అందుబాటులో లేకుండా పోయారు. వారిలో ఎక్కువ మంది కటకటాల వెనెక్కే వెళ్లారు. ఇప్పటికీ నిర్మానుష్యంగా ఉన్న హైకోర్టుకు వెళ్లే దారి కశ్మీర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మియాన్ అబ్దుల్ ఖయ్యూంను అరెస్ట్ చేసి ఆగ్రా జైల్లో నిర్బంధించగా, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ రోంగాను అరెస్ట్ చేసి మొరదాబా జైల్లో నిర్బంధించారు. ఆ తర్వాత బారముల్లా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ సలాం రాథర్‌ను అరెస్ట్ చేసి యూపీ జైల్లో నిర్బంధించారు. అందుబాటులో లేకుండా పోయిన అనంతనాగ్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయద్ సోదాగర్ జాడ కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సీనియర్ న్యాయవాది మొహమ్మద్ యూసుఫ్ భట్, ఆయన కుమారుడు, న్యాయవాది జుబేర్ అహ్మద్ భట్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారని సోఫియన్ జిల్లా కోర్టు న్యాయవాదులు తెలిపారు. హైకోర్టు ఆవరణలో అతికించిన నోటీసు వారందరిని రెండేళ్లపాటు ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించేందుకు అవకాశం ఉన్న కశ్మీర్‌కు మాత్రమే పరిమితమైన ‘ప్రజా భద్రతా చట్టం’ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత మంది న్యాయవాదులను అరెస్ట్ చేయడమే కాకుండా వారు విధులు నిర్వర్తించడానికి వీల్లేకుండా కోర్టుల తలుపులకు తాళాలు వేసి ఉంచడం పట్ల కశ్మీర్ బార్ అసోసియేషన్‌కు చెందిన 1,050 మంది న్యాయవాదులు ఇటీవల సమావేశమై అరెస్టయిన న్యాయవాదులే తరఫునే కాకుండా అదశ్యమైన యువకుల తరఫున ‘హబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏడుగురు న్యాయవాదులను నియమించారు. కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా ఢిల్లీలో విద్యార్థుల నిరసన శ్రీనగర్‌లోని కశ్మీర్ హైకోర్టు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని, ఈ విషయంలో అవసరమైతే తానే స్వయంగా శ్రీనగర్‌కు వెళతానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోర్టులన్నీ యథావిధిగా పనిచేసేందుకు తమ అధికార యంత్రాంగం తప్పకుండా సహకరిస్తుందని, హైకోర్టుతోపాటు దిగువ కోర్టులు కూడా సజావుగానే పనిచేస్తున్నాయని కశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు గురువారం నాడు ప్రకటించారు. ఇప్పటికీ కశ్మీర్లో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించలేదని, ప్రభుత్వ రవాణా సర్వీసులేవీ నడవడం లేదని, కొన్ని చోట్ల కోర్టుల తలుపులు తెరస్తున్నప్పటికీ సిబ్బందిగానీ, జడ్జీలుగానీ, న్యాయవాదులుగానీ రావడం లేదని కశ్మీర్ బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దాదాపు సగం న్యాయవాదులు జైళ్లలో మగ్గుతుంటే ఇంకా ఎవరు వచ్చి విధులు నిర్వర్తిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కశ్మీరీలకు బంగారు భవిష్యత్తు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న నేపథ్యంలో ఈ నిర్బంధం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. -
బార్ కౌన్సిల్ విభజనపై వైఖరేమిటి?
రాష్ట్ర బార్ కౌన్సిల్, రిజిస్ట్రార్ జనరల్‌కు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: రెండు రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను కూడా రెండుగా విభజించడంపై తమ వైఖరి ఏమిటో తెలియచేయాలని హైకోర్టు బార్ కౌన్సిల్‌ను, హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి బార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసేలా కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది సీహెచ్. వెంకట నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ నవీన్‌రావు శుక్రవారం విచారించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్వర్తించాల్సిన విధులను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిలే నిర్వర్తిస్తుందంటూ ఈ నెల 21న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రొసీడింగ్స్ జారీ చేసిందని, ఇలాంటి ప్రొసీడింగ్స్ జారీ చేసే పరిధి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేదని పిటిషనర్ తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై వైఖరి ఏమిటో తెలియచేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.