బతకాలని లేదని యువతి.. | young woman did not live | Sakshi
Sakshi News home page

బతకాలని లేదని యువతి..

Published Wed, Apr 27 2016 12:30 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

young woman did not live

యాకుత్‌పురా: ఫ్యాన్‌కు ఉరేసుకొని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ప్రకాశ్‌రెడ్డి వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతానికి చెందిన నాగిరెడ్డి కూతురు కల్పన రెడ్డి(23) అబిడ్స్‌లోని మెథడిస్ట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల సమీపంలోని ఓ హాస్టల్ ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న ఆమె ఆదివారం చాంద్రాయణగుట్ట డీఆర్‌డీఎల్ క్వార్టర్స్‌లో నివాసముండే మామయ్య నరేందర్ రెడ్డి ఇంటికి వచ్చింది.

మంగళవారం  ఉదయం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గదిని పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. తమ్ముడిని బాగా చూసుకోవాలని... తనకు బతకాలని లేదని ఉంది. కామారెడ్డిలోని కల్పన ఇంటి పక్కన ఉండే శ్రీకాంత్‌రెడ్డి అనే యువకుడు ప్రేమించమని వేధించేవాడని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మామ నరేందర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement