Shocking: Three Men Hanging Dog To Death At Ghaziabad, Video Goes Viral - Sakshi
Sakshi News home page

అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి...

Published Mon, Nov 14 2022 11:12 AM | Last Updated on Tue, Nov 15 2022 9:36 AM

Three Men Hanging Dog To Death At Ghaziabad Goes Viral - Sakshi

ఇటీవల మోగ జీవాల పట్ల కొంత మంది మనుషులు అత్యంత హేయంగా ప్రవర్తిస్తున్నారు. అదీకూడా కుక్కలపై అత్యంత ఘోరమైన అకృత్యాలకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి కుక్క మెడకు గొలుసు వేసి దాన్ని తన బైక్‌కి కట్టి ఈడ్చుకెళ్లడం, అంతకముందు ఒక కుక్క పదేపదే మొరుగుతుందని ఇటుకతో కొట్టి చంపేయడం వంటి కిరాతకాలకు ఒడిగడుతున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడూ ముగ్గురు వ్యక్తులు ఒక కుక్క చనిపోయేలా ఉరి వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు ఒక కుక్కను చిత్రహింసలకు గురిచేసి, ఆ కుక్క మెడకు ఉరి వేసి ఆనందించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ సైట్‌ వద్ద ముగ్గురు దుండగులు ఒక కుక్క మెడను గొలుసుతో ఒక గోడకు ఉరిలా వేలాడి దీసి రకరకాలుగా హింసించడం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన ఘటన నెట్టింట వైరల్‌ అవుతోంది. ఐతే పోలీసులు ఈ ఘటన మూడు నెలల క్రితం జరిగిన ఘటన అని, సదరు వ్యక్తులకు పిలిపించి నోటీసులు జారీ చేశామని తెలిపారు. 

(చదవండి: అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement