యువకుడి ఆత్మహత్య
వెలుగోడు శివారులోని వన్ ఆర్ తూమ్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వెలుగోడు: పట్టణ శివారులోని వన్ ఆర్ తూమ్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన భాస్కర్‌గౌడ్(30) పట్టణ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. శుక్రవారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘట స్థలాన్ని ఆత్మకూరు సీఐ దివాకర్‌రెడ్డి పరిశీలించారు. ఘటన స్థలంలో మృతుడి డ్రై వింగ్ లైసెన్స్ ఉండటంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ బాషా తెలిపారు.