ఉరేసుకొని బాలిక ఆత్మహత్య
Published Thu, Aug 25 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
చేబ్రోలు : స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్‌లో బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చేబ్రోలు ఎస్వీ ఎస్పీ స్పిన్నింగ్ మిల్లులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోర్ల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతని కుమార్తె మోర్ల సునీత(13) నారాకోడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. గురువారం సాయంత్రం సమయంలో సునీత క్వార్టర్స్‌లోని గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. మరణానికి దారి తీసిన పరిస్థితులు తెలియలేదు. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ ఆరాధ్యుల కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Advertisement
Advertisement