ప్రేమించిన వ్యక్తితో పెళ్లికావడం లేదని మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జూబ్లీహిల్స్: ప్రేమించిన వ్యక్తితో పెళ్లికావడం లేదని మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ జవహర్‌కాలనీలో నివసించే గాలి లక్ష్మీప్రియ(25) ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని కోరగా.. తనకు ఓ వ్యాధి ఉందని, పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితంలో ఇబ్బందులు వస్తాయని అతడు చెప్పాడు.
దీంతో ఆమె వెనుకడుగు వేసింది. అయితే అతడిని పెళ్లి చేసుకునేందుకు మరో యువతి ముందుకు రావడంతో లక్ష్మీప్రియ మనస్తాపానికి గురైంది. తన చావుకు ఎవరూ కారణంకాదంటూ సూసైడ్ నోట్‌రాసి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.