తమిళనాడు, తిరువొత్తియూరు: కోవై జిల్లాలో భర్తకు తెలియకుండా మరో యువకుడిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నించిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన ప్రైవేటు సంస్థ ఉద్యోగి వధువు కోసం ఇంటర్నెట్‌లో మ్యారేజ్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అదేవిధంగా కోవై గణపతి మణియకారం పాళయం ప్రాంతానికి చెందిన యువతి వరుడు కావాలని నమోదు చేసుకుంది. యువతి ఫొటో చూసిన యువకుడు ఆ యువతికి ఫోన్ చేశాడు. ఇద్దరి మధ్య పొత్తు కుదిరి వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు.
మూడు నెలల కిందట కోవైలో స్నేహితుల మధ్య వీరికి నిశ్చితార్థం జరిగింది. బుధవారం కోవైలో ఓ హోటల్‌లో వీరికి వివాహానికి ఏర్పాట్లు చేశారు. బెంగళూరు నుంచి వరుని తరఫు బంధువులు హోటల్‌కు చేరుకున్నారు. అయితే వధువు తరఫున కుటుంబ సభ్యులు, బంధువులు రాలేదు. తల్లిదండ్రులకు ఆరోగ్యం సరిగా లేదని వారు రాలేకపోయారని వధువు తెలిపింది. దీంతో సందేహం కలిగిన వరుడి బంధువులు వధువు వద్ద ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో వారికి అనుమానం కలగడంతో ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు జరిపిన విచారణలో సదరు యువతికి వివాహమై మూడేళ్ల కుమారుడు ఉన్నట్టు తెలిసింది. ఆమెను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment