వివాహానికి నిరాకరించడంతో.. ప్రియుడి కళ్లెదుటే కిరోసిన్‌.. | Young Woman Suicide In Chennai Over On Love Affair | Sakshi
Sakshi News home page

ప్రేమికుడు ఎదుటే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని..

Published Mon, Nov 9 2020 6:41 AM | Last Updated on Mon, Nov 9 2020 6:41 AM

Young Woman Suicide In Chennai Over On Love Affair - Sakshi

చెన్నై: ఏర్వాడిలో ప్రియుడు వివాహానికి నిరాకరించడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కలక్కాడు సమీపానగల ఏర్వాడికి చెందిన శంకర్‌ కుమార్తె ఐశ్వర్య (18). ఈమె పక్కింటికి చెందిన అయ్యప్పన్‌ (22) అనే డ్రైవర్‌ను ప్రేమించింది. ఈ క్రమంలో అతను వివాహానికి నిరాకరించడంతో శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధురాంతకానికి చెందిన స్నేహ (21) కూవత్తూరుకు చెందిన సంతోష్‌ ప్రేమించుకున్నారు.  వీరి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడడంతో మనస్తాపానికి గురైన స్నేహ ప్రేమికుడు సంతోష్‌ ఎదుటే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో చికిత్సలు పొందుతూ శనివారం మృతిచెందింది.    (తునిలో ఎన్నారై సురేశ్‌ మృతి కలకలం.. భార్యే..! )

తల్లిని కడతేర్చి తనయుడు ఆత్మహత్య 
టీ.నగర్‌: తల్లిని హతమార్చి తనయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చెన్నై గిండిలో చోటుచేసుకుంది. చిన్నమలైకు చెందిన ఆరోగ్యరాజ్‌ (33) అవివాహితుడు. తల్లి మేరి (80)తో కలిసి ఉంటున్నాడు. సరైన ఉపాధి లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం ఇతని ఇంట్లో నుంచి దుర్వాసనలు వస్తుండడంతో ఇరుగుపొరుగు గిండి  పోలీసులకు సమాచారం తెలిపారు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఆరోగ్యరాజ్‌ తల్లిని కత్తితో పొడిచి హత్యచేసి తనూ గొంతుకోసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  (సీఐ సోమశేఖర్, హెడ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement