తల్లి, పిల్లల మృతదేహాలు, శునకాల కళేబరాలు
సాక్షి, చెన్నై: ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో ఏమో. కన్న బిడ్డలకే కాదు, పెంపుడు శునకాలకు సైతం విషం ఇచ్చి తన తల్లితో కలిసి ఓ కుమార్తె ఆత్మహత్య చేసు కుంది. ఆదివారం అర్ధరాత్రి వేళ వెలుగు చూసి న ఈ సంఘటన పట్టుకోట్టైలో కలకం రేపింది.
తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడికి చెందిన రాజగోపాల్ పది నెలల క్రితం మరణించాడు. దీంతో ఆయన భార్య శాంతి(50), కుమార్తె తులసి(21), మనవరాళ్లు సారల్(2), మరో చిన్నారి (10 నెలలు) తంజావూరు జిల్లా పట్టుకోట్టైకి ఈ ఏడాది జనవరిలో వచ్చారు. వలవన్ పురంలో సహాదేవన్ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. వారి పూర్తి వివరాలు ఎవరికీ తెలియదు. పిల్లలు ఉన్నా తులసి భర్త ఎవరనే విషయం బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆ ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్క ఇంటి వారు అనుమానంతో ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. ఆయన గ్రామ వీఏవో సుమతి ద్వారా పోలీసుల్ని ఆశ్రయించారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు.
సర్వత్రా దిగ్భ్రాంతి
ఇంటి లోపల దృశ్యాల్ని చూసిన పోలీసులు, స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. శాంతి ఉరి వేసుకుని మృతిచెందింది. పక్కనే బెడ్ మీద ఇద్దరు పిల్లలు, తులసీ, ఆ పక్కనే రెండు పెంపుడు శునకాలు మరణించి ఉన్నాయి. అంద రూ కొత్త బట్టలు ధరించి ఉన్నారు. ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియకపోవడంతో విచారణ కష్టతరంగా మారింది. ఇళ్లు అద్దెకు తీసుకున్న సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి పేర్లను నిర్ధారించారు. ఆ ఇంట్లో మగవాళ్లు లేకపోవడంతో ఆర్థిక కష్టాలతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
పిల్లలను హతమార్చి... ఆత్మహత్య?
పోలీసుల దర్యాప్తు మేరకు శాంతి, తులసి బలన్మరణానికి పాల్పడే ముందు ఇద్దరు బిడ్డలు, శునకాలకు విషం ఇచ్చి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. తులసి ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకోవడం, ఆమెను బెడ్ మీద పడుకోబెట్టిన అనంతరం శాంతి అదే తాడుకు ఉరివేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తు న్నారు. తులసి గొంతు భాగంలో తాడు బిగి సిన సమయంలో ఏర్పడిన గాయం ఉంది. ఇద్దరు ఆడ బిడ్డలు, శునకాల నోటి నుంచి నురగ వస్తోంది. మృతదేహాల్ని పోస్టు మార్టం తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment