
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి రామాలయం వీధిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లీ, కూతురు ఉరేసుకున్నారు. మృతులను సంగిరెడ్డి కృష్ణవేణి (55), కూతురు శివపావని (27), నిషాంత్ (9), రితిక (7)లుగా గుర్తించారు. కుటుంబకలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. శివ పావని భర్త రెండో పెళ్లి చేసుకోవడమే ఘటన కు కారణంగా తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. (చదవండి: రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు)
Comments
Please login to add a commentAdd a comment