ఫోన్‌ మాట్లాడుతుంటే మందలించారని.. వాష్‌రూంలోకి వెళ్లి.. | Girl Ends Life By Hanging Herself Rangareddy | Sakshi
Sakshi News home page

ఫోన్‌ మాట్లాడుతుంటే మందలించారని.. వాష్‌రూంలోకి వెళ్లి..

Dec 21 2021 11:41 AM | Updated on Dec 21 2021 2:01 PM

Girl Ends Life By Hanging Herself Rangareddy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దివ్యశ్రీ (21) డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తరచూ ఫోన్‌ మాట్లాడుతుండటంతో తండ్రి మందలించాడు.

సాక్షి,పహాడీషరీఫ్‌( రంగారెడ్డి): తరచూ ఫోన్‌ మాట్లాడుతుందని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ బి.భాస్కర్‌ వివరాల ప్రకారం.. మల్లాపూర్‌ బాలాజీనగర్‌ ప్రాంతానికి చెందిన పోలోజు ఆంజనేయచారి కుమార్తె దివ్యశ్రీ (21) డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తరచూ ఫోన్‌ మాట్లాడుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం మధ్యాహ్నం స్నానం చేసేందుకు వెళ్లి వాష్‌రూంలోనే ఉరేసుకుంది. ఆంజనేయచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

కుటుంబ కలహాలతో..
శంకర్‌పల్లి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. శంకర్‌పల్లి సీఐ మహేశ్‌గౌడ్‌ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన ఆంజనేయులు (28), స్వరూప దంపతులు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. తరుచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆంజనేయులు ఇంట్లోనే పడుకున్నాడు. అర్ధరాత్రి భార్య చూసే సరికి భర్త మరొక గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చదవండి: అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement