
ప్రతీకాత్మక చిత్రం
రమేష్(36) అనే యువకుడు అదే ప్రాంతంలో పనిచేస్తోన్న సుజాత అనే వివాహితతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు
మేడ్చల్ జిల్లా : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి యప్రల్ శైలి గార్డెన్స్‌లోని జూపల్లి హోమ్స్‌లో విషాదం చోటుచేసుకుంది. వివరాలు..స్థానికంగా నివాసముంటున్న రమేష్(36) అనే యువకుడు అదే ప్రాంతంలో పనిచేస్తోన్న సుజాత అనే వివాహితతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం సుజాత భర్తకు తెలియడంతో ఆయన తీవ్రంగా మందలించాడు.
దీంతో మనస్తాపానికి గురైన రమేశ్ బుధవారం ఉదయం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.